తెలుగు ప్రేక్షకులు ముందు నుంచి కూడా సాంఘీక కథా చిత్రాలనే కాకుండా, భక్తిరస పౌరాణికాలు, జానపద, సోషియో ఫాంటసీ సినిమాలు కూడా ఆదరిస్తూ వచ్చారు. ఇది 1960వ దశకం నుంచి ఉందే. అయితే ఈ చిత్రాలు 1990వ దశకం ముందు వరకు బాగా వచ్చేవి. ఆ తర్వాత ఈ సినిమాలు తీసే సాహసం ఎవ్వరూ చేయడం లేదు. ఈ భక్తిరస, జానపద సినిమాల్లో ఎక్కువుగా సీనియర్ ఎన్టీఆర్ నటించారు. ఈ తరం హీరోల్లో అంత సాహసం ఎవ్వరూ చేయలేదు. అయితే ఒక్క బాలయ్య మాత్రమే దేవుడి పాత్రల్లో నటించారు.
ఆ తర్వాత బాలయ్య ఫ్యాక్షన్ లీడర్‌గా, గౌతమీపుత్ర శాతకర్ణిగా ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు. బాలయ్య డైలాగ్ డెలివరీయే ఆయనకు ఫుల్ ప్లస్. ఆయన వేషధారణి, డైలాగ్ డెలివరీ, నడక ఇలా అన్ని వైవిధ్యంగా ఉంటాయి. ఇక ఇప్పుడు బాలయ్య పోషించే పాత్ర సాంఘిక కథాంశంలో బాలయ్య హీరోగా కనిపిస్తారట. సాంఘీక కథా చిత్రాల్లో దేవుడిగా కనిపించడం అంటే పెద్ద సాహసంతో కూడుకున్నదే. ఇటీవల కాలంలో గోపాల గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ కనిపించని దేవుడిగా నటించారు.
ఈ సినిమాలో మోడ్రన్ దేవుడిగా పవన్ సూటు, బూటు వేసుకుని చాలా స్టైలీష్‌గా కనిపించారు. అయితే ఏదోలా ఆ సినిమా సక్సెస్ అయ్యింది కానీ మరీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయేంత గొప్ప చిత్రం కాలేదు. అయితే ఇప్పుడు ఓ రీమేక్ కోసం బాలయ్యను దేవుడిగా నటించాలని మేకర్స్ సంప్రదించారట. మరి బాలయ్య ఈ పాత్రకు ఇంకా ఎస్ అయితే చెప్పలేదట. ఒకవేళ ఆయన ఈ సినిమా చేస్తే అది సంచలనమే అవుతుంది.
బాలయ్య గతంలో పౌరాణిక సినిమాల్లో దేవుడిగా కనిపించినా.. సాంఘీక కథలో దేవుడిగా ఎలా ఒదిగిపోతాడు ? అన్నది చూడాలి. అయితే బాలయ్య సీరియస్ పాత్రలు చేయడంలో కొట్టిన పిండి. మరి ఆయన ప్రత్యేకమైన ఇమేజ్ దృష్ట్యా బాలయ్య ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.