సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ పేరు నీ కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఫ్యాన్ బేస్, ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. చిన్నప్పటి నుంచే మహేష్ కి సినిమాలు కొత్త ఏమి కావు. నాలుగేళ్లకే నీడ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. చిన్నప్పటి నుంచే సినిమాలు చెయ్యడంతో మహేష్ కి డ్యాన్సులు, ఫైట్లు, యాక్టింగ్ కూడా కొత్తేమీ కాదు. బాలనటుడిగా ఎన్నో సినిమాలతో మెప్పించిన మహేష్
రాజకుమారుడు మూవీతో 1999 లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే నంది అవార్డ్ గెలుచుకున్నారు. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సరే మహేష్ కి స్టార్ డమ్ రావడానికి చాలా టైమ్ పట్టింది. మహేష్ తొలి సినిమాని సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ కలిసి కృష్ణ వారసుడుగా మహేష్ బాబుని అందలం ఎక్కించారు.
రాజకుమారుడు తర్వావాత మహేష్ బాబు చేసిన యువరాజు మూవీ కూడా హిట్.. ఇంకేముంది కృష్ణ అభిమానుల ఆనందానికి అవధులు లేవు. కానీ కొంత మంది మాత్రం విమర్శలు చేశారు. సూపర్ స్టార్ కృష్ణ గారు ఒక మాస్ హీరో .. మహేష్ లుక్స్ మరియు తన చేసిన రెండు సినిమాలు క్లాస్ గా వుండటం తో మహేష్ మాస్ హీరో కాలేడు అని విమర్శలు చేశారు. అయితే మహేష్ మాత్రం అవేం పట్టించుకోకుండా ఫ్యామిలీ స్టోరీస్ మరియు లవ్ స్టోరీస్ ని చేసుకుంటూ వచ్చాడు. అలా వచ్చిందే మురారి. ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం. మురారి సినిమా మహేష్ ని ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఇంకాస్త దగ్గర చేసింది. కానీ ఆ ఆనందం ఎక్కువరోజులు నిలువలేదు ఆ తరువాత కొన్ని సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి.
అయితే మహేష్ బాబు చేసిన 7వ చిత్రం ఒక్కడు. ఈ సినిమాతో తనని మాస్ హీరో కాదు అని విమర్శించిన వాళ్ళందరూ ముక్కు మీద వేలు వేసుకునేలా చేశారు మహేష్ బాబు. ఒక్కడు మూవీ ఒక ట్రెండ్ సెట్టర్. ఈ సినిమాతో మహేష్ స్టార్ హీరో గా ఎదిగాడు. కానీ వెంటనే వచ్చిన మూవీ నిజంతో ఫ్లాప్ చవి చూసాడు కానీ ఈ సినిమాలో మహేష్ యాక్టింగ్ కి నంది అవార్డ్ వచ్చింది. ఇక 2006 లో వచ్చిన పోకిరి సినిమా తో మహేష్ బాబు సూపర్ స్టార్ గా ఎదిగిపోయాడు. ఇక అక్కడి నుంచి మహేష్ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. వెయ్యికి పైగా చిన్నారులకు హార్ట్ ఆపరేషన్ చేయించి హీరో గానే కాదు మనిషి గా తన వ్యక్తిత్వం చాటుకున్నారు.
అయితే ఇంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ మహేష్‌కి ఒకానొక టైమ్ లో బాగా ఇబ్బందుల్లో పడ్డాడు అన్న ప్రచారం బాగా జరిగింది. మహేష్ ఇబ్బందుల్లో పడడానికి కారణం ఏంటి ? మహేష్‌ను ఆ ఇబ్బంది నుంచి బాలయ్య ఎలా ? గట్టెక్కించాడు ? అన్నది ఈ తరం జనరేషన్లో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కె. రాఘవేంద్రరావు బ్యానర్లో శోభన్ దర్శకత్వంలో బాబి సినిమా వచ్చింది. ఈ సినిమా ఒక్కడుకు ముందు రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో ఆర్తీ అగర్వాల్ హీరోయిన్. ఈ సినిమా పెద్ద డిజాస్టర్.
అయితే ఈ సినిమా షూటింగ్ టైంలో ఓ డ్రైవర్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ తో అసభ్యంగా ప్రవర్తించడంతో షూటింగ్ కి ఆలస్యం అయింది. దీనితో సహనం కోల్పోయిన మహేష్ ఆ డ్రైవర్ మీద చేయి చేసుకున్నారట. అప్పుడు ఈ సినిమాలో యాక్టింగ్ చేస్తున్న కొంతమంది జూనియర్ ఆర్టిస్ట్ లు అందరూ షూటింగ్ లో పాల్గొనకుండా మహేష్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారట. దానితో షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. అసలేం జరుగుతుందో అని అందరూ చాలా కంగారు పడ్డారు.
అప్పుడే ఈ సమస్యను నటసింహం బాలకృష్ణ సాల్వ్ చేశాడు. విషయం తెలుసుకున్న బాలయ్య నేరుగా షూటింగ్ స్పాట్‌కు వెళ్లి మహేష్ క్షమాపణ చెప్పే ప్రశక్తే లేదని స్వయంగా తన కారులో వెక్కించుకుని వెళ్లిపోయాడట. ఆ తర్వాత జూనియర్ ఆర్టిస్టులు తప్పు తమ డ్రైవర్‌దే అని తెలుసుకుని.. యధావిధిగా షూటింగ్‌లో పాల్గొన్నారట. ఇక మహేష్ – బాలయ్య అనుబంధం తమ ఫ్యామిలీల నుంచి అలాగే కంటిన్యూ అవుతోంది. ఇటీవల బాలయ్య అన్‌స్టాపబుల్ షోకు కూడా మహేష్ రావడం.. బాలయ్య తనదైన ప్రశ్నలతో రచ్చ చేయడం.. మహేష్‌ను సరదాగా ఆటపట్టించడం మనం చూశాం.