ఎస్ పై టైటిల్ ఇప్పుడు అక్షరాలా నిజం.. ఈ సినిమాను తొక్కేసే ప్రయత్నాలు మొదలైపోయాయి. బాలీవుడ్ వాళ్లు.. నార్త్ మీడియా బాలీవుడ్‌పై శీతకన్ను వేయడంతో పాటు తన అక్కసు మొదలు పెట్టేసింది. బాహుబలి 1 తర్వాత బాలీవుడ్‌తో పాటు నార్త్‌లో తెలుగు సినిమాల డామినేషన్ స్పష్టంగా మొదలైంది. తెలుగు సినిమాలు బాలీవుడ్‌లో రిలీజ్ అవుతున్నాయంటే చాలు వాళ్లకు వణుకు పట్టుకుంటోంది. ఒకప్పుడు తెలుగు సినిమాలు అంటే అందరికి చిన్న చూపే ఉండేది. ఎవరికో ఎందుకు తమిళ సినిమా పరిశ్రమ అయితే తెలుగు వాళ్లను చిన్న చూపు చూసేది. అప్పట్లో శంకర్ సినిమాలు సౌత్ మొత్తాన్ని ఏలేయడంతో పాటు బాలీవుడ్‌లోకి వెళ్లి అక్కడ కూడా సక్సెస్ అయ్యేవి. కాస్తో కూస్తో శంకర్ లాంటి ఒకరిద్దరు దర్శకుల సినిమాలే బాలీవుడ్‌లోకి వెళ్లేవి.
అయితే ఇప్పుడు తమిళ కథలు అరవ వాసనతో బూజుపట్టిపోయి రొడ్డ కొట్టుడుగా మారిపోయాయి. బాహుబలి ది బిగినింగ్ సినిమా వచ్చినప్పుడు హిందీలో రిలీజ్ చేస్తే చాలా చిన్న చూపు చూశారు. ఆర్ కమల్‌ఖాన్ లాంటి వాళ్లు నా జీవితంలో ఇంత పరమ చెత్త సినిమా చూడలేదన్నారు. చివరకు ఉమైర్ సంధు లాంటి వాళ్లు కూడా ఆ సినిమాను పెద్ద డిజాస్టర్ అన్నారు. చివరకు తొలి రోజు సినిమాకు అనుకున్నంత టాక్ కూడా రాలేదు.
రెండో రోజు నుంచి బాహుబలి హవా బాక్సాఫీస్ దగ్గర స్టార్ట్ అయ్యింది. ఇటు తెలుగుతో పాటు అటు బాలీవుడ్‌లోనూ వసూళ్ల మోత మోగించేసింది. సౌత్‌లో అన్ని ఇండస్ట్రీల్లోనూ దున్నేసింది. చివరకు బాలీవుడ్ మీడియా కూడా ఈ ప్రభంజనం చూశాక అయిష్టంగానో లేదా కష్టంగానో బాహుబలిని భుజానికి ఎత్తుకోక తప్పలేదు. అప్పుడు సల్మాన్ భజరంగీ భాయ్‌జాన్‌కు బాహుబలి ఎక్కడ పోటీ వస్తుందో ? అని బాలీవుడ్ జనాలు భయపడిచచ్చారు. చివరకు ఈ పోరులో బాహుబలి పై చేయి సాధించింది. ఓ ప్రాంతీయ భాషా సినిమా ఇంత పెద్ద విజయం ఏంట్రా అని వాళ్లు ముక్కున వేలేసుకున్నారు.
ఇక బాహుబలి – ది కంక్లూజన్‌కు వచ్చే సరికి బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు ? అన్న ప్రశ్నకు ఆన్సర్ కోసం ప్రపంచమే ఎదురు చూసింది. చివరకు మీడియా ప్రమోషన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే భారతదేశ సినీ జనాలు ఉర్రూతలూగిపోయారు. ఆ సినిమాను దేశ మీడియాతో పాటు ప్రపంచ మీడియా కూడా మోసేసింది. తిరుగులేని బ్లాక్‌బస్టర్ చేసింది.
త్రిబుల్ ఆర్‌పై బాలీవుడ్ మీడియా శీతకన్ను ?
అయితే ఇప్పుడు త్రిబుల్ ఆర్ విషయంలో బాలీవుడ్ మీడియా శీతకన్నుతోనే ఉంటోంది. బాహుబలి 1,2 తర్వాత కేజీఎఫ్ కూడా అక్కడ బ్లాక్‌బస్టర్ అయ్యింది. డిజాస్టర్ టాక్‌తోనూ ప్రభాస్ సాహో ఏకంగా రు. 150 కోట్లు కొల్లగొట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన బన్నీ పుష్ప రు. 100 కోట్లు రాబట్టింది. తాము ఇలాగే చూస్తూ ఉంటే బాలీవుడ్‌పై సౌత్ సినిమా డామినేషన్.. ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమాల డామినేషన్ పెరిగిపోతుందన్న భయం వాళ్లను నీడలా వెంటాడుతోంది. పైగా గంగూబాయి, కశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలతో ఇప్పుడిప్పుడే బాలీవుడ్ కాస్త పుంజుకుంటోన్న టైంలో త్రిబుల్ ఆర్ ను ఆకాశానికి ఎత్తేస్తే అది తమ ఇండస్ట్రీకే పెద్ద దెబ్బ పడుతుందని వాళ్లు భయపడుతున్నారు.
అందుకే త్రిబుల్ ఆర్‌కు నేషనల్ మీడియాలో పెద్దగా కవరేజ్ ఉండడం లేదు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోడీ లాంటి వాళ్లు సైతం కశ్మీర్ ఫైల్స్‌ను ప్రశంసించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం భుజానకు ఎత్తుకుంది. అందుకే ఇప్పుడు ఆ సినిమానే నేషనల్ మీడియా మోస్తోంది. బాహుబలి 2 ప్రమోషన్లపై పెద్దగా దృష్టి పెట్టని రాజమౌళి ఇప్పుడు నార్త్‌లో త్రిబుల్ ఆర్ ప్రమోషన్లకు బాగా కష్టపడుతున్నాడు. తన ఇద్దరు హీరోలు చెర్రీ, తారక్‌లను వెంట పెట్టుకుని మరీ ఈవెంట్లకు వెళ్లడం.. ఇంటర్వ్యూలు ఇవ్వడం చేస్తున్నాడు.
పైగా సినిమాలో లోపాలు ఉంటే ఆడేసుకోవాలని వాళ్లు కాచుకుని ఉన్నారు. అంతెందుకు ఇటీవల వచ్చిన ప్రభాస్ రాధేశ్యామ్‌ను బాలీవుడ్ ఓ ఆటాడుకుంది. ఇప్పుడు త్రిబుల్ ఆర్ విషయంలోనూ అలాంటి ఆలోచనలు, వ్యూహాలే అమలు చేసేందుకు రెడీగా ఉన్నారట. ఎవరెన్ని కుట్రలు పన్నినా సినిమాలో దమ్ముంటి ప్రేక్షకుడికి కిక్ ఇచ్చిందంటే మళ్లీ బాలీవుడ్ మతులు చెడిపోయేలా .. వాళ్ల గింగరాలు తిరిగేలా రికార్డులు దున్నేయడం ఖాయం.