అలియా భట్..ఇప్పుడు అమ్మడు క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మహేశ్ భట్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ..బడా బడా దర్శకులతొ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంటుంది. దర్శక ధీరుడు రాజమౌళి సైతం అమ్మడుని తన సినిమాలో హీరోయిన్ గా పెట్టుకున్నారంటే అలియా రేంజ్ ఏంటో మనకు అర్ధమైపోయి ఉండాలి. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ సినిమాతో మొదలైన అమ్మడి సినీ ప్రస్దానం..ఆ తరువాత ‘రాజీ’, ‘కపూర్ అండ్ సన్స్’, ‘హైవే’, ‘ఉడ్తా పంజాబ్’, ‘డియర్ జిందగీ’ తదితర హిట్ చిత్రాలతో అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది.
ఇప్పటి వరకు హిందీలోనే సినిమాలు చేసినా ఈ బ్యూటీ త్వరలో తెలుగులోను తన నటనా టాలెంట్ ను చూయించబోతుంది. చరణ్-తారక్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను కూడా అలరించేందుకు సిద్ధమవుతోందీ అందాల తార. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో అలియా తీరు చాలా మందిని ఆకట్టుకుంది. అయితే రీసెంట్ గా ఆమె నటించిన చిత్రం ‘గంగూబాయి కతియవాడి’ . డైనమిక్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కింది. ఈ చిత్రం ఫిబ్రవరి 25వ తేదీన .. పవన్ కళ్యాణ్ .. రానా కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ భీమ్లానాయక్ సినిమా తో పోటీగా అన్ని భాషలలో విడుదలై మంచి టాక్ ను సంపాదించుకుంది. నాలుగు రోజుల్లోనే దాదాపుగా రూ.50కోట్ల వసూళ్లను సాధించింది.
అయితే ఈ సినిమా కోసం అమ్మడు తన కెరీర్ లోనే ఎప్పుడు తీసుకోనంత రెమ్యూనరేషన్ ని తీసుకుందట. ఇక్కడ మరో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే..అదే సినిమా కీలక పాత్రలో కనిపించిన అజయ్ దేవగణ్ కన్నా కూడా అలియా డబుల్ పారితోషకానీ తీసుకున్నట్లు తెలుస్తుంది. అలియా దాదాపుగా ఈ పాత్ర కోసం రూ. 22కోట్లను రెమ్యునరేషన్‌గా అందుకుందని బీ టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక అజయ్ అతిథి పాత్రలో మెరిసినందుకు గాను రూ.10కోట్లను పారితోషికంగా తీసుకున్నాడని బాలీవుడ్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఓ హీరోయిన్ ఒక్క సినిమా 22 కోట్లు తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. మన హీరోయిన్లు 2, 3, 4 దగ్గరే ఆగిపోతే అలియా 20 క్రాస్ చేసింది. ఇదే జోరు కొనసాగితే ఇప్పట్లో అమ్మడుని టచ్ చేయడం చాలా కష్టం అంటున్నారు సినీ విశ్లేషకులు