ప్రస్తుతం త్రిబుల్ ఆర్ సినిమా మానియా ప్రపంచ వ్యాప్తంగా ఎలా ? ఉందో చూస్తూనే ఉన్నాం. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు ప్రేయసి పాత్రలో అలియా భట్ నటించింది. ఆమె పాత్ర సినిమాలో ఉన్నది తక్కువ సేపే అయినా అలియా అందచందాలు, ఆ పాత్రలో ఆమె ఎక్స్‌ప్రెషన్స్, క్యూట్ లుక్స్ బాగున్నాయన్న ప్రశంసలు అయితే వస్తున్నాయి. అలియాభట్ తెలుగులో తొలిసారిగా చేసింది ఈ సినిమాయే. ఈ సినిమా తర్వాత ఆమె ఎన్టీఆర్ సినిమాలో నటిస్తోందన్న వార్తలు కూడా వస్తున్నాయి.
ఏదేమైనా త్రిబుల్ ఆర్ సినిమాతో అలియా పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. అసలు ఈ సినిమాలో ఆమెకు ఎలా ? ఛాన్స్ వచ్చింది.. అని అడిగితే ఆమె తాజా ఇంటర్వ్యూలో చాలా విషయాలే చెప్పుకువచ్చింది. బాహుబలి సినిమాకు ముందు నుంచే అలియా రాజమౌళి సినిమాలు చూసుకుంటూ వస్తున్నానని.. ఇక బాహుబలి సినిమా చూశాక.. తాను ఖచ్చితంగా రాజమౌళి సార్ సినిమాలో నటించేయాలని ఫిక్స్ అయిపోయానని చెప్పింది.
ఓ సారి రాజమౌళి సార్ ఎయిర్‌పోర్టులో కనిపించినప్పుడు తానే వెంటనే వెళ్లిపోయి ఆయన్ను కలిసి విష్ చేసి.. సార్ మీ సినిమాలో నటిస్తాను అని చెప్పడంతో ఆయన వెంటనే ఓకే అన్నారట. ఆ తర్వాత ఓ రోజు ఫోన్ చేసి త్రిబుల్ ఆర్ సినిమా గురించి చెప్పారట. ఈ సినిమాలో నీది అల్లూరి భార్య సీత పాత్ర అని చెప్పారట. ఈ లోగా లాక్‌డౌన్ వచ్చింది. ఆన్‌లైన్‌లోనే తెలుగు నేర్చుకున్నాను అని.. రాజమౌళి భాష విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని చెప్పింది.
ఇక రణబీర్‌తో ప్రేమ గురించి కూడా ఆమె మాట్లాడింది. సావరియాలో రణబీర్‌ను చూసినప్పుడే తాను ప్రేమలో పడిపోయాను అని.. అప్పటకి నాకు 14 ఏళ్లు మాత్రమే.. తన సినిమాలు మొత్తం చూసేదాన్ని.. ఓ సారి కరణ్ జోహార్‌తో చెపితే రాక్‌స్టార్ సినిమా కార్యక్రమంలో రణబీర్‌తో మాట్లాడించారు. కరణ్ జోహార్ రణబీర్‌ణు ఎంత ఇష్టపడుతున్నానో చెప్పమన్నారట. దీంతో రణబీర్ గురించి చాలా మాటలు అలియా మాట్లాడేసిందట.
ఆ మాటలకు రణబీర్ యా దట్స్ వెరీ నైస్ అలియా అని రణబీర్ రిప్లై ఇచ్చాడట. ఆ తర్వాత ఇద్దరూ స్నేహితులు అయ్యారట. స్నేహం ముదరడంతో కొన్నాళ్లకు రణబీర్‌కు తనపై అభిప్రాయం కలగడంతో నన్ను ప్రేమించడం మొదలు పెట్టాడు. కరోనా రాకపోయి ఉంటే ఈ పాటికే పెళ్లి అయిపోయి ఉండేది.. అయితే నా దృష్టిలో రణబీర్‌తో ప్రేమలో పడినప్పుడే నా పెళ్లి అయిపోయిందని అలియా చెప్పుకొచ్చింది.