గత కొంత కాలంగా సరైన హిట్ కోసం వేచి చూస్తున్న శర్వానంద్ కి ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమా కొంతమేర ఉపశమనం కలిగించిదనే చెప్పాలి. ఫ్యామిలీ హీరో శర్వా..నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన లేటేస్ట్ చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. తిరుమల కిషోర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా లో రాధికా శరత్‌కుమార్, ఖుష్బు, ఊర్వశి వంటి సీనియర్ హీరోయిన్లు నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిందన్న విషయాని చిత్ర బృందం ప్రతి ఇంటర్వుల్లో చెప్పుకొస్తూనే ఉన్నారు. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకుని ఉన్నారు.
కాగా, నేడు ఈ సినిమా రిలీజై మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. సినిమా చూసి వచ్చిన జనాలు ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ మూవీ పై భిన్న విభ్న్న కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో శర్వ కామెడి టైమింగ్ బాగుందని..ఫస్ట్ హాఫ్ లో పంచ్ డైలాగ్స్ బాగా నవ్వుతెప్పిస్తాయని అంటున్నారు. ఫన్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను మరోసారి మెప్పించారు డైరెక్టర్ తిరుమల కిషోర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వయసు ముదిరిపోతున్న పెళ్లి కానీ ఓ అబ్బాయి..తనకు పెళ్లి చేయమంటూ ఇంట్లో వాళ్లను టార్చర్ పెట్టే విధంగా తెరకెక్కించిన కొన్ని సీన్స్ ప్రతి బ్యాచిలర్ కి కనెక్ట్ అవుతాయని అంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకి దేవి పాటలు, బాగా హెల్ప్ అయ్యాయి అని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు అనిపించినా..టైటిల్ సాంగ్ బాగుందని..కామెంట్స్ చేస్తున్నారు.
ఫస్టాఫ్ అంతా కూడా కామెడీతో నడిపించిన డైరెక్టర్ .. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగా సెట్ చేశాడని.. ఇక సెకెండాఫ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో లాక్కోచ్చాడని ..ఓవర్ ఆల్ గా సినిమా యావరేజ్‌గా ఉందని చెబుతున్నారు. అయితే మరి కొందరు మాత్రం ఈ సినిమా పై నెగిటివ్ గా స్పందిస్తున్నారు. సినిమాలో చెప్పుకొతగిన ఎలిమెంట్స్ ఏం లేవు అని..డైలీ చూస్తున్న సీరియల్ లానే ఉన్నాయని..ఇందులో కొత్తగా ఏముంది అంటూ వాళ్ళ అభిప్రాయాని తెలియజేస్తున్నారు. ఇంకొందరు అయితే “ఈ సినిమా సీరియల్ కి ఎక్కువ లా..సినిమాకి తక్కువ లా ఉంది” అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ఫైనల్లీ మొత్తంగా శర్వా ఈసారి అయిన హిట్ కొట్టాడా లేదా అనేది..మరి కొద్ది సేప్పట్లో “తెలుగు లైవ్స్” లో వచ్చే రివ్యూ లో చదివి తెలుసుకోండి..!!