Moviesఆంధ్రావాలా లాంటి డిజాస్ట‌ర్ త‌ప్పించుకున్న స్టార్ హీరో... ఎన్టీఆర్ బ్యాడ్‌ల‌క్‌...!

ఆంధ్రావాలా లాంటి డిజాస్ట‌ర్ త‌ప్పించుకున్న స్టార్ హీరో… ఎన్టీఆర్ బ్యాడ్‌ల‌క్‌…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో పాటు కొన్ని ప్లాప్‌ సినిమాలు కూడా వచ్చాయి. ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ – ఆది – సింహాద్రి లాంటి వరుస హిట్లతో సూపర్ ఫామ్‌లో ఉన్న సమయంలో ఎంతో మంది నిర్మాతలు… దర్శకులు ఆయనతో సినిమాలు చేసేందుకు వెంటపడ్డారు. సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ కు తిరుగులేని మాస్ ఇమేజ్ వచ్చింది. ఆ వెంటనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆంధ్రావాలా సినిమాలో నటించాడు. ఈ సినిమా తొలి రోజు.. తొలి షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. సినిమా ప్లాప్‌ అయినా కూడా ఈ సినిమా కొన్న బయ్యర్లు.. ఎగ్జిబిటర్లకు నష్టాలు రాలేదంటే అప్పట్లో ఎన్టీఆర్ క్రేజ్ ఎలా ? ఉండేదో అర్థమవుతుంది.

అప్పటికే సింహాద్రి తెలుగులో పెద్ద‌ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా ఏకంగా 55 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. ఆ వెంటనే ఆంధ్రావాలా సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చకపోయినా ఎన్టీఆర్ అభిమానులు.. సినిమా అభిమానులు పిచ్చ పిచ్చగా చూడడంతో ఆంధ్రావాలా సినిమాకు నష్టాలు రాలేదు. ఈ సినిమా కోస‌మే ఎన్టీఆర్ స్వ‌గ్రామం నిమ్మ‌కూరులో ఆడియో ఫంక్ష‌న్ పెడితే ఏకంగా 20 ల‌క్ష‌ల మంది రావ‌డం అప్ప‌ట్లో పెద్ద సంచ‌ల‌నం అయ్యింది.

అయితే ఇదే కథను దర్శకుడు పూరీ జగన్నాథ్ ముందుగా మెగాస్టార్ చిరంజీవికి వినిపించారు. అయితే ఈ కథను చిరంజీవి రిజెక్ట్ చేశారు. తర్వాత ఈ కథ అటు ఇటు తిరిగి ఎన్టీఆర్ దగ్గరకు వచ్చింది. సింహాద్రి క్యారెక్ట‌ర్‌లో ఎన్టీఆర్ రౌద్ర ర‌సం చూసిన తెలుగు ప్రేక్షకులు.. ఆంధ్రావాలా క్యారెక్టర్ లో ఎన్టీఆర్ ను ఊహించుకోలేక పోయారు. 2004 జనవరి ఒకటో తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించ లేదు. చిత్రమేంటంటే అదే సంవత్సరం సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజి – బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహ – ప్రభాస్ నటించిన వర్షం సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాల‌లో బాలయ్య లక్ష్మీనరసింహ – ప్రభాస్ వర్షం సినిమాలు సూపర్ హిట్టయ్యాయి.

అలా చిరంజీవితో ఆంధ్రావాలా సినిమా మిస్సయిన పూరి జగన్నాథ్ చిరంజీవి కం బ్యాక్‌ సినిమా 150 వ సినిమాకు కూడా దర్శకత్వం వహించే అవకాశం కోల్పోయారు. చిరు కోసం పూరి ఆటోజానీ స్క్రిప్ట్ రెడీ చేశారు. ఈ కథను మూడు.. నాలుగు సార్లు విన్న చిరు అసంతృప్తి వ్యక్తం చేయడంతో పట్టాలెక్కలేదు. అప్పట్లో పూరి జగన్నాథ్ సైతం ఈ సినిమా కోసం ఐదారు నెలలు వెయిట్ చేసి చివరకు చిరు ఓకే చెప్పకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు.

ఆ త‌ర్వాత చిరు త‌న కం బ్యాక్ మూవీగా ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాలో న‌టించాడు. ఈ సినిమా కోలీవుడ్ హిట్ మూవీ క‌త్తికి రీమేక్‌. చిరు సినిమాను రెండు సార్లు మిస్ అయిన పూరి చిరంజీవి తనయుడు రామ్ చ‌రణ్ డెబ్యూ మూవీ చిరుత‌కు దర్శకత్వం వహించే ఛాన్స్‌ కొట్టేశారు. మరి చిరంజీవిని డైరెక్ట్ చేయాలనుకుంటున్న పూరి కోరిక ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news