సినిమా రంగంలో నెంబర్ వన్ ర్యాంకులు ప్రతి శుక్రవారం మారిపోతూ ఉంటాయి. ఇక్కడ ఎంత పెద్ద హీరో అయినా.. ఒక్క రోజులో జీరో అవుతారు. అప్పటి వరకు అంచనాలు లేకుండా జీరోలుగా ఉన్నోళ్లు సైతం ఒక్క దెబ్బకు హిట్ పడితే హీరో అయిపోతూ ఉంటారు. అలాగే ఓ కథ హీరో దగ్గరకు వచ్చినప్పుడు అది హిట్ అవుతుందా ? లేదా ? అన్నది సరైన జడ్జ్‌మెంట్ చేయడం కూడా చాలా గొప్ప. ఓ మంచి కథను సరైన జడ్జ్‌మెంట్ లేక వదులుకుంటే.. ఆ సినిమా హిట్ అయ్యాక చాలా ఫీల్ అవ్వాలి. అలాగే కొందరు వదులుకున్న రాంగ్ కథను మనం ఓకే చేసి సినిమా చేసి ప్లాప్ అయితే చాలా బాధపడాలి.
ఇక 2006లో వచ్చిన సిద్దార్థ్ బొమ్మరిల్లు సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్. తెలుగు సిద్దార్థ్‌కు ఆ సినిమాతోనే తిరుగులేని అప్లాజ్ వచ్చింది. ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన జెనీలియా హాసిని పేరుతో తెలుగు ప్రేక్షకుల మదిలో అలా నిలిచిపోయింది. బొమ్మరిల్లు వచ్చాక సిద్ధార్థ్ యూత్‌లో తిరుగులేని కింగ్ అవ్వడంతో పాటు మంచి ఛాన్సులు వచ్చాయి. ఆ సినిమా డైరెక్టర్ భాస్కర్ ఏకంగా మగధీర సినిమా తర్వాత మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌తో ఆరెంజ్ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు.
ఇక జెనీలియా కూడా మంచి ఆపర్లే దక్కించుకుంది. ఈ సినిమా చూసిన తెలుగు జనాలు తమ ఇంట్లో హాసిని లాంటి ఆడపిల్ల ఉండాలని కోరుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఇప్పటకీ మార్మోగుతూనే ఉంటాయి. అప్పట్లో రు. 6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా రు. 50 కోట్ల వసూళ్లు రాబట్టి దిల్ రాజుకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత దిల్ రాజు టాలీవుడ్‌లో మరింత స్ట్రాంగ్ ప్రొడ్యుసర్ అయిపోయాడు.
అయితే ఈ కథను భాస్కర్ – దిల్ రాజు కలిసి మొదట మరో హీరో నవదీప్‌కు చెప్పారట. అప్పటకి ఇంకా నవదీప్ హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు. దిల్ రాజు ఈ కథతో సినిమా తీసి నవదీప్‌ను హీరోగా పరిచయం చేయాలని పట్టుదలతో ఉన్నాడట. అయితే అప్పటికే జై సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నవదీప్ గౌతమ్ ఎస్ఎస్‌సీ, మొదటి సినిమా, ప్రేమంట ఇంతే సినిమాలను వరుసగా లైన్లో పెట్టుకున్నాడు. దీంతో బొమ్మరిల్లును వదులుకున్నాడు.
విచిత్రం ఏంటంటే నవదీప్ చేసిన అన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి. బొమ్మరిల్లు ఇండస్ట్రీలో నిలిచిపోయే హిట్ అయ్యింది. ఈ సినిమాను తాను వదులుకున్నందుకు జీవితాంతం బాధపడుతూనే ఉంటానని నవదీప్ ఎన్నోసార్లు చెప్పాడు. ఒకవేళ నవదీప్ బొమ్మరిల్లు చేసి ఉంటే హీరోగా అతడి కెరీర్ మరికొన్నాళ్లు కంటిన్యూ అవ్వడంతో పాటు.. అతడి కెరీర్‌లో ఓ మంచి సినిమా చరిత్రలో మిగిలిపోయి ఉండేది. తరతరాల పాటు గుర్తుండిపోయే సినిమా వదులుకోవడం ఎవరికి అయినా బాధ కలిగిస్తుంది కదా ?