మరో రెండు రోజుల్లో రిలీజ్‌కు రెడీ అవుతోన్న రాధే శ్యామ్‌పై అంచనాలు అమాంతం ఒక్కసారిగా పెరిగిపోయాయి. మూడేళ్ల నుంచి ఊరిస్తూ వస్తోన్న ఈ సినిమా కొద్ది గంటల్లోనే థియేటర్లలోకి దిగనుంది. ప్రభాస్ – పూజా హెగ్డే నటించిన ఈ సినిమాకు జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. బాహుబలి సీరిస్ సినిమాలతో పాటు సాహోతో ఇండియన్ సినిమా అభిమానులతో సాహో అనిపించుకున్న యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
మూడేళ్ల నుంచి షూటింగ్ రు. 250 కోట్ల భారీ బడ్జెట్.. యూరప్‌లోని ఇటలీలో 1960వ టైంలో జరిగిన ప్రేమకథ, పామిస్ట్రీ నేపథ్యం ఇవన్నీ వింటుంటే ఈ సినిమా ఎలా ఉంటుందా ? అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఇక లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ఈ సినిమా రన్ టైంను మేకర్స్ 12 నిమిషాలు ట్రిమ్ చేశారు. దీంతో మొత్తం రన్ టైం 138 నిమిషాలుగా వచ్చింది. అంటే 2 గంటల 18 నిమిషాలు. ఇది చాలా తక్కువ రన్ టైం అని చెప్పాలి.
రు. 300 కోట్ల బడ్జెట్ సినిమాకు ఇంత తక్కువ రన్ టైం అంటే చాలా క్రిస్పీ అని చెప్పాలి. దీనిని బట్టి చూస్తే సినిమా చాలా వరకు ఉరుకులు పరుగులు పెడుతూనే ఉంటుందని అర్థమవుతోంది. కొన్ని మంచి సీన్ల ఫుటేజ్ తీసేశారని.. అయితే సినిమా స్పీడ్‌గా మూవ్ అయ్యేందుకు మేకర్స్ ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని తెలుస్తోంది. సెన్సార్ వాళ్లు సినిమా చూసి 150 నిమిషాల సినిమాకు యూ / ఏ సర్టిఫికేట్ జారీ చేశారు.
ఇక రాజమౌళి ఈ సినిమా చూసి కొన్ని కరెక్షన్లు చెప్పడంతో మొత్తం 56 మార్పులు చేశారట. 2 నుంచి 5 సెకన్ల పాటు కత్తిరించిన సీన్లు చాలా ఉన్నాయట. కొన్ని చోట్ల 2 నిమిషాల పాటు ఉన్న సీన్లను కూడా ట్రిమ్ చేశారని అంటున్నారు. ఎడిటింగ్ రూమ్‌లో చాలా కసరత్తులే జరిగాయని క్లీయర్‌గా తెలుస్తోంది. ఓవరాల్‌గా సెన్సార్ కు వెళ్లడానికి ముందు.. ఆ తర్వాత చూస్తే 23 నిమిషాల పాటు ట్రిమ్ జరిగినట్టు చెపుతున్నారు.
పైకి 23 నిమిషాలు ట్రిమ్ చేసినట్టు కనపడుతున్నా.. ఈ ఫుటేజ్ విలువ కోట్లలోనే ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ హస్త ముద్రికుడి ప్రేమకథ అతడి జీవితాన్ని ఎలా మలుపులు తిప్పింది అన్న కోణంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమా జాతకం ఏంటో 11న తేలిపోనుంది.