నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ సినిమా రిలీజ్ అయిన డే 1 నుంచి కూడా రికార్డుల వేట స్టార్ట్ చేసింది. కరోనా రెండో వేవ్ తర్వాత పెద్ద పెద్ద హీరోలే తమ సినిమాలు థియేటర్లలో రిలీజ్ చేసేందుకు భయపడుతోన్న వేళ బాలయ్య డేర్ చేసి అఖండను వదిలేశాడు. నిజానికి ఇప్పుడు వరుస పెట్టి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే అందుకు బాలయ్య అఖండ సినిమాతో ఇచ్చిన ధైర్యమే. అఖండ తర్వాత పుష్ప వచ్చింది. ఇప్పుడు వరుస పెట్టి పెద్ద సినిమాలు వస్తున్నాయి. ఇక 100 రోజులు పూర్తి చేసుకున్న అఖండ రికార్డులు చాలానే ఉన్నాయి. డే 1 నుంచి అఖండ క్రియేట్ చేసిన ఒక్కో రికార్డును చూద్దాం.
106 కేంద్రాల్లో 50 రోజులు :
మామూలుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండో వారం పోస్టర్ చూడడమే ఎంత పెద్ద హిట్ సినిమాకు అయినా గగనం అవుతోంది. అయితే అఖండ 50 రోజుల పాటు దాదాపు 60 నుంచి 80 శాతం ఆక్యుపెన్సీతో బాక్సాఫీస్ దద్దరిల్లేలా చేసింది. ఇండియాలోనే 103 కేంద్రాల్లో 50 రోజులు ఆడిన ఈ సినిమా ఓవరాల్‌గా 106 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. పైగా ఏపీ, తెలంగాణతో పాటు కర్నాకట, మహారాష్ట్రలోని షోలాపూర్ లాంటి చోట్ల కూడా 50 రోజులు ఆడింది. వంద కేంద్రాల్లో ఇప్పుడు 50 రోజులు ఆడడం అంటే చాలా గ్రేట్.
20 కేంద్రాల్లో 100 రోజులు :
50 రోజుల సెంటర్ల విషయంలో రికార్డు క్రియేట్ చేసిన అఖండ అదే జోరుతో బాక్సాఫీస్ దగ్గర 100 రోజుల వైపు కూడా స్పీడ్‌గానే పరుగులు పెట్టింది. మొత్తం నాలుగు కేంద్రాల్లో డైరెక్టుగా 100 రోజులు ఆడగా… షిఫ్టులతో కలుపుకుని మొత్తం 20 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.
ఆదోనీ – రాజ్
చిలకలూరిపేట – రామకృష్ణ
ఎమ్మిగనూరు – శ్రీనివాస
కోయిలకుంట్ల – ఏవీఆర్
ఈ నాలుగు కేంద్రాల్లో డైరెక్టుగా 100 రోజులు ఆడగా.. ఇవన్నీ ఏపీలోనే ఉన్నాయి. ఇందులోనూ మూడు కేంద్రాలు ఒక్క కర్నూలు జిల్లాలోనే ఉండగా.. మరొకటి గుంటూరు జిల్లాలో ఉంది. ఇక షిఫ్టులతో 100 రోజులు ఆడిన కేంద్రాల్లో అనంతపూర్ – హిందూపుర్ – కర్నూలు – తిరుపతి – అమలాపురం – భీమవరం – రాజమండ్రి – కాకినాడ – ఏలూరు – విజయవాడ – గాజువాక – శ్రీకాకుళుం – తణుకు – బొబ్బిలి – పార్వతీపురం – ఒంగోలు కేంద్రాల్లో వంద రోజులు పూర్తి చేసుకుంది.
రు. 156 కోట్ల గ్రాస్… రు. 94 కోట్ల షేర్ :
బాలయ్య కెరీర్‌లో రు. 100 కోట్ల క్లబ్‌లో ఉన్న సినిమా ఇప్పటి వరకు లేదు. అయితే అఖండ దెబ్బకు పాత రికార్డులకు పాతర పడిపోయింది. రు. 156 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా.. రు. 94 కోట్ల షేర్ రాబట్టింది. ఏపీలో టిక్కెట్ రేట్ల ఇష్యూ లేకపోయి ఉంటే బాలయ్య కెరీర్‌లో రు. 100 కోట్ల షేర్ క్లబ్‌లో చేరిన తొలి సినిమా రికార్డు కూడా అఖండ ఖాతాలోనే పడి ఉండేది. ఇక థియేట్రికల్ + నాన్ థియేట్రికల్ అమౌంట్ కలుపుకుంటే మొత్తం రు. 225 కోట్ల వసూళ్లు అఖండ కొల్లగొట్టింది.
సింగిల్ లాంగ్వేజ్ సినిమాగా అఖండ మరో రికార్డు :
ఇప్పుడు వచ్చిన తెలుగు సినిమాలు రు. 200 కోట్లు, రు. 300 కోట్లు అని చెపుతున్నారు. కానీ సింగిల్ లాంగ్వేజ్ ( తెలుగు) భాషలో వసూళ్లు మాత్రమే కలుపుకుంటేనే అఖండ పై రికార్డులు నమోదు చేసింది. పైగా కోవిడ్ కష్టాలు, ఏపీలో టిక్కెట్ రేట్ల ఇబ్బందుల్లో రిలీజ్ అయ్యి ఇన్ని రికార్డులు సాధించింది. ఇదంతా బాలయ్య వన్ మ్యాన్ షో మానియాయే అని చెప్పాలి. పై అంశాలు కూడా కలిసి వస్తే అఖండ ఇంకెన్ని రికార్డులు సాధించేదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే ఈ నెల 12న కర్నూలులో అఖండ వంద రోజులు ఫంక్షన్ కూడా గ్రాండ్‌గా జరుగుతోంది.