త్రిబుల్ ఆర్ ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారత సినీ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. మూడేళ్లుగా నిర్మాణంలోనే ఉన్న ఈ సినిమా ఇప్పటికే రెండు, మూడు సార్లు వాయిదా పడింది. ఇక మొన్న సంక్రాంతి కానుకగా జనవరి 7న రిలీజ్ చేయాలని అనుకున్నా.. ఒమిక్రాన్ దెబ్బతో మరోసారి వాయిదా వేయక తప్పలేదు. ఈ సారి మార్చి 25న త్రిబుల్ ఆర్ వస్తోంది. ఇక ఈ నెల 11నే మరో పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ రిలీజ్ అవుతోంది. రాధేశ్యామ్‌కు, త్రిబుల్ ఆర్‌కు రెండు వారాల గ్యాప్ ఉంది.
ఇక బాహుబలి 2 తర్వాత రాజమౌళి నుంచి వస్తోన్న సినిమా కావడంతో త్రిబుల్ ఆర్ అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి. ఎక్కడికక్కడ బుకింగ్స్ అదిరిపోతున్నాయి. ఓవర్సీస్‌లో అయితే హంగామా మామూలుగా లేదు. అసలే రాజమౌళి సెన్షేషన్. బాహుబలి దెబ్బకు రాజమౌళి ఖ్యాతి ఖండాలు దాటేసింది. ఇటు టాలీవుడ్ చరిత్రలోనే టాప్ హీరోలుగా ఉన్న ఇద్దరు యంగ్ హీరోలు. ఇంతకన్నా గొప్ప కాంబినేషన్‌ను మనం ఇప్పట్లో ఊహించలేమేమో..! అందుకే త్రిబుల్ ఆర్‌పై అంచనాలు ఆకాశంలోనే ఉన్నాయి.
రిలీజ్‌కు మరో మూడు వారాల టైం ఉన్నా కూడా ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర త్రిబుల్ ఆర్ హంగామా మామూలుగా లేదు. ఇప్పటికే ఎన్టీఆర్ వీరాభిమాని ఒకరు ఏకంగా 75 టిక్కెట్లు బుక్ చేసిన ఫొటో వైరల్ అవుతోంది. మరొక ఎన్టీఆర్ అభిమాని డల్లాస్‌లో ఓ థియేటర్ అంతా బుక్ చేసిపడేశారు. మామూలుగా ఏ సినిమాకు అయినా అడ్వాన్స్ బుకింగ్‌లు ఉంటాయి. త్రిబుల్ ఆర్‌కు ఏకంగా మూడు వారాల ముందు అడ్వాన్స్ బుకింగ్‌లు పెట్టారు. అసలు అడ్వాన్స్ బుకింగ్‌లతోనే సినిమా రికార్డుల వేట స్టార్ట్ చేసింది.
రిలీజ్‌కు మూడు వారాల ముందే బుకింగ్‌లతో ఈ సినిమాకు 1.5 మిలియన్ డాలర్ల అమౌంట్ వచ్చేసింది. బాహుబలి 2 సినిమా అడ్వాన్స్ బుకింగ్‌లతోనే 4 మిలియన్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడు త్రిబుల్ ఆర్ కూడా అదే బాటలో వెళుతోన్న పరిస్థితే ఉంది. ఏదేమైనా బాహుబలి 2 తర్వాత ఆ రేంజ్‌లో వస్తోన్న టాలీవుడ్ సినిమా కావడంతో ఓవర్సీస్ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టేందుకు రెడీ అయిపోయారని ఈ బుకింగ్స్ చెపుతున్నాయి.
రు.1000 కోట్ల వసూళ్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీ స్టార్ట్ చేసిన ఈ సినిమా ఓవర్సీస్లో 10 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబడుతుందని సినిమా మేకర్స్ అంచనా వేస్తున్నారు. ఏదేమైనా త్రిబుల్ ఆర్ క్రియేట్ చేసే రికార్డులు ఊహకే అందడం లేదు.