Moviesఆయన సినిమాలో హీరోయిన్ గానా.. వద్దు బాబోయ్ వద్దు..భయంతో బెదిరిపోతున్న బ్యూటీస్..!!

ఆయన సినిమాలో హీరోయిన్ గానా.. వద్దు బాబోయ్ వద్దు..భయంతో బెదిరిపోతున్న బ్యూటీస్..!!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రినీవాస్ గురించి ఎంత చెప్పిన అది తక్కువే. మాటలు తక్కువ చేతలు ఎక్కువ. ఈయన రాసే పంచ్ డైలాగులకు చాలా మంది అభిమానులు ఉన్నారు. దాదాపు మూడేళ్ల పాటు రైటర్ గా పలు సినిమాలకు పని చేసిన ఈ మాటల మాంత్రికుడు 2002లో డైరెక్టర్ గా మారాడు. డైరెక్షన్ లో అదరగొట్టేశాడు. అప్పటి లవర్ బాయ్ అయిన తరుణ్ తో తన తొలి సినిమాను తెరకెక్కించాడు. నువ్వే నువ్వే సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సొంతం చేసుకుందో మనకు తెలిసిందే. ఇక అప్పటి నుంచి వెనక్కు తిరిగి చూసుకోని త్రివిక్రమ్ ఈ 20 ఏళ్లలో దాదాపు 11 సినిమాలను తెరకెక్కించాడు. అన్నీ సినిమాలో హిట్టే. దీంతో ఆయనంటే ఓ స్పేషల్ క్రేజ్ ఏర్పదింది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రినీవాస్ సినీ ఇండస్ట్రీలో ఏం చేసినా ఒక సంచలనమే అవుతుంది.. ఈయన తన డైలాగులతో ఎప్పటికీ ప్రేక్షకులలో ఒక హైప్ ను క్రియేట్ చేస్తూ ఉంటాడు. అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. బడా బడా స్టార్ హీరో లు ఈయన తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారంటే ఆయన కు ఉన్న క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. కాకపోతే త్రివిక్రమ్ తన మాటల తూటాలతో హీరోయిజాన్ని ఏ రేంజ్ లో చూపిస్తాడో, అదే రేంజ్ లో గ్లామర్ రోల్స్ లో హీరోయిన్ లను కూడా చూపిస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

అంతే కాదు ఈయన దర్శకత్వంలో నటించే ఏ హీరోయిన్ అయినా సరే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంటుంది. కానీ ఈయన సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసిన హీరోయిన్స్ కెరీర్ క్లిక్ అవ్వదు అనే ఓ పేరు ఉంది. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లైతే.. జల్సా సినిమాలో రెండో హీరోయిన్ గా పార్వతి మెల్టన్, ఆ తర్వాత అత్తారింటికి దారేది సినిమాలో ప్రణీత, సన్నాఫ్ సత్యమూర్తి సినిమా లో ఆదా శర్మ, అజ్ఞాతవాసి సినిమా లో అను ఇమ్యన్యుయెల్, అరవింద సమేత వీర రాఘవ సినిమా లో ఈషా రెబ్బా, అల వైకుంఠ పురం లో నివేదా పేతురజ్ లు హీరోయిన్ గా నటించగా వారి కి తర్వాత ఆ సినిమా తర్వాత కెరీర్ ఏ మాత్రం ముందుకు వెళ్లకపోవడం తో ఎంతో నిరాశ చెందుతన్నారు.

దీంతో కొందరు హీరోయిన్లు ఆయన సినిమాలో సెకండ్ హీరోయిన్ అంటేనే భయపడిపోతున్నారు. అవకాశాలు సంగతి పక్కన పెడితే ఉన్న ఇమేజ్ కూడా పోతుంది అంటూ బెదిరిపోతున్నారు. ఇక ఈ రీజన్ తోనే మహేష్ తో ఆయన తెరకెక్కించే సినిమాలో సెకండ్ హీరోయిన్ బ్యాడ్ సెంటిమెంట్ వల్ల సెకండ్ హీరోయిన్ గా ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదని టాక్ వినిపిస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news