పవర్ స్టార్ పవన్ కల్యాణ్..రీఎంట్రీ తరువాత కూడా పవర్ ఫుల్ స్టోరీలతో యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నాడు. వకీల్ సాబ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తరువాత చాలా టైం గ్యాప్ తో మళ్లీ మనముందుకు “భీమ్లా నాయక్” అనే సినిమాతో రాబోతున్నాడు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా మయాళ హిట్ చిత్రం ‘అయ్యప్పన్ కోషియమ్’కు రీమేక్ అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫిసర్ పాత్రలో కనిపించనుండగా, ఆయనను ఢీ కొట్టే పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నారు.
ఇక ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులో పవర్ స్టార్ కు జోడీగా నిత్యా మీనన్, రానా భార్య గా సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిజానికి ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ భీమ్లా నాయక్ పలు కారణాలతో ఫిబ్రవరి 25న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ కి సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చిన్నత్లు తెలుస్తుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ షూటింగ్ ప్యాచ్ వర్క్ పూర్తి చేసుకుని.. రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి రిటర్న్ అవుతన్న టైంలో ..ఈ వ్యక్తి ద్వారా అక్కడే ప్రభాస్ ‘ప్రాజెక్ట్ ఖ్’ సినిమాషూటింగ్ జరుగుతుందని తెలుసుకోని.. ఎవ్వరికి చెప్పకుండానే లొకేషన్లోకి వెళ్ళిపోయి నిల్చున్నారట. దీంతో అక్కడే ఉన్న ప్రాజెక్ట్ K’ టీ షాక్ అయిందట.
ఇక అక్కడే ఉన్న బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి కూడా పవన్ ను చూసి ఆశ్చర్యపోయాడట. వెంటనే పవన్ దగ్గ్రకు వెళ్ళి పలకరించుకుని..‘ప్రాజెక్ట్ ఖ్’ డీటైల్స్ గురించి..షూటింగ్ ఎంత వరకు వచ్చిందో అని అడిగి తెలుసుకున్నారట. ఇక ప్రభాస్ అయితే కాసేపు ఏం మాట్లాడకుండా ఆ షాక్ లోనే ఉండిపోయారట. కొంచెం టైం తరువాత పవన్ తో బాగా మాటలు కలిపేశాడు మన డార్లింగ్ హీరో. దీంతో సెట్ లో కొంచెం సేపు పండగ వాతవరణం నెలకొంది.
ఇక భీమ్లా నాయక్’తో రిలీజ్‌కు రెడీ అయిన పవన్.. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌కు సిద్ధమవుతున్నారు. ‘భవదీయుడు భగత్‌సింగ్’ చిత్రీకరణకూ రెడీ అవుతున్నారు. అలాగే ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమా మార్చి 11న పాన్ ఇండియా లెవల్లో విడుదలవుతుంది. మరో వైపు ప్రభాస్ ఆది పురుష్ చిత్రీకరణను పూర్తి చేసేశారు. సలార్ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ కె సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ప్రభాస్ బిజీగా ఉన్నారు.