ప్రస్తుతం ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధ. గత మూడు దశాబ్దాలకు పైగా సుధ టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. తెలుగుతో పాటు తమిళ్‌లో కూడా ఆమె టాప్ హీరోల సినిమాల్లో ఎన్నో క్యారెక్టర్లు వేశారు. తల్లి, అత్త, వదిన ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె పాత్రలు ఎన్నో పాపులర్ అయ్యారు. ఎప్పుడో 17 ఏళ్ల క్రితమే ఆమె విక్టరీ వెంకటేష్‌కు నువ్వునాకునచ్చావ్ సినిమాలో అత్త పాత్ర వేశారు. ఓ సినిమాలో నాగార్జునకు వదిన అయ్యారు. ఇక మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఎన్టీఆర్‌కు కూతురు అయ్యారు.
ఇక ఇటీవల కాలంలో యూట్యూబ్ ఛానెల్స్‌కు సుధ వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె తన కెరీర్‌లో జరిగిన పలు ఆసక్తికర విషయాలు కూడా చెపుతున్నారు. కెరీర్ స్టార్టింగ్‌లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు ఒక్కొక్కటిగా చెపుతున్నారు. సుధ క్యారెక్టర్ ఆర్టిస్టే అయినా కూడా ఆ పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే ఒప్పుకునేవారు. అందుకే ఆమె సపోర్టింగ్ రోల్స్‌కు కూడా మంచి పేరు వచ్చింది. సీన్లో ఓ మూల అలంకార ప్రాయంగా ఉండే పాత్రలు చేయడం తనకు ఇష్టం ఉండదని సుధ కుండబద్దలు కొట్టేస్తూ ఉంటుంది.
ఈ క్రమంలోనే సుధ తాజా ఇంటర్వ్యూలో మేజర్ చంద్రకాంత్ షూటింగ్ టైంలో హీరో మంచు మనోజ్‌ను తల్లి నిర్మలమ్మ ఎందుకు కొట్టిందో చెప్పారు. ఎన్టీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన, మోహన్‌బాబు కలిసి కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో మేజర్ చంద్రకాంత్ సినిమా చేశారు. ఈ సినిమా షూటింగ్ నాచారంలో జరుగుతుండగా.. మనోజ్‌ను కూడా నిర్మలమ్మ తీసుకువచ్చేవారట.
ఒక్కోసారి మనోజ్ తాను అన్నం తిననని మారాం చేసేవాడట. అప్పుడు నిర్మలమ్మ మనోజ్‌ను పట్టుకుని కొట్టేవారట. అప్పుడు మనోజ్ ఏడుస్తూ ఈ మమ్మి నాకు నచ్చడం లేదు.. ఆ మమ్మీ దగ్గరకు వెళతానని సుధ దగ్గరకు వచ్చేవాడట. ఇప్పటకీ ఆ బాండింగ్ అలాగే ఉందట. ఆ కాలంలో నటులకు చాలా విలువ ఉండేదని.. అయితే ఇప్పుడు ఆ విలువ పూర్తిగా పోయిందని సుధ చెప్పుకువచ్చింది.