పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి కాంబినేషన్లో తెరకెక్కిన భీమ్లానాయక్ సినిమా ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి మంచి టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. ఈ సినిమా హిట్ అవ్వడంతో అందరి దృష్టి ఈ సినిమా డైరెక్టర్ సాగర్‌చంద్రపై పడింది. సాగర్ చంద్ర త్రివిక్రమ్‌లా సీనియర్, పాపులర్ డైరెక్టర్ అయ్యి ఉంటే ఆయన గురించి ఇప్పటికే చాలా తెలుసుకుని ఉంటారు.. అయితే ఇప్పటి వరకు కేవలం రెండు సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించాడు సాగర్. అవి కూడా రాజేంద్రప్రసాద్‌తో అయ్యారే, నారా రోహిత్ – శ్రీవిష్ణుతో అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలు డైరెక్ట్ చేసేవాడు. ఇవి రెండు మరి గొప్ప సినిమాలు కాకపోవచ్చు.. కానీ ఈ సినిమాలు చూసిన వారు డైరెక్టర్‌లో విషయం ఉందన్నది గ్రహించారు.
అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలు చూసిన సుకుమార్, సురేందర్‌రెడ్డి సైతం సాగర్ చంద్రకు ఫోన్ చేసి అభినందించారు అంటేనే అతడు సీనియర్, టాప్ డైరెక్టర్లను సైతం ఎలా ఆకట్టుకున్నాడో అర్థమవుతోంది. ఇక సాగర్‌చంద్ర స్వస్థలం నల్లగొండ. బీటెక్ పూర్తి చేసి అమెరికాకు వెళ్లి మాస్టర్స్ పూర్తిచేశాడు. ఆ టైంలో తన పక్కన ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఉండేది. దీంతో సినిమా రంగం పట్ల ఆసక్తి పెంచుకుని సినిమాటోగ్రఫీతో పాటు కొన్ని కోర్సులు కూడా కంప్లీట్ చేశాడట.
ఇక సాగర్ చంద్ర తండ్రి పేరు రామచంద్రారెడ్డి. ఆయన నల్లగొండలో స్కూల్స్ నిర్వహిస్తూ ఉంటారు. అమ్మ సునీత కూడా నల్లగొండలోనే ఉంటూ తండ్రికి సాయపడుతూ ఉంటారట. ఇక సాగర్ చంద్ర అక్క గౌతమి అమెరికాలో స్థిరపడింది. ఇక సాగర్ భార్య పేరు గీతారెడ్డి. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. 2017లో వీరి పెళ్లి జరిగింది. గీత కూడా సాగర్ లాగానే బీటెక్ చేసి తర్వాత మాస్టర్స్ చేసేందుకు విదేశాలకు వెళ్లింది. కొద్ది రోజులు ఉద్యోగం చేసిన ఆమె ఆ తర్వాత ఉద్యోగం మానేసి గృహిణిగా ఉంటోంది.
ఇక తనకు తెలుగు భాషపై ఎక్కువుగా పట్టు ఉండడానికి ప్రధాన కారణం.. ఎక్కువుగా పుస్తకాలు చదవడమే అని చెప్పాడు. తాను డైరెక్టర్‌ను కాకపోయి ఉంటే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయడంతో పాటు స్టారప్ స్టార్ట్ చేసేవాడిని అని సాగర్ చెప్పాడు. ఏదేమైనా భీమ్లానాయక్ హిట్‌తో సాగర్ ఓవర్‌నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు.