ప్రస్తుతం అమ్మాయిలకు హీరోయిన్ అవకాశాలు రావాలంటే చాలా గొప్ప అన్నట్టుగా ఉంది. ఎంతో మంది యువతులు వెండితెరపై ఓ వెలుగు వెలిగిపోవాలని ఎన్నో ఆశలతో ఇక్కడకు వస్తున్నారు. అలా వచ్చే అమ్మాయిలు ముళ్ల కంచెలు దాటుకుని హీరోయిన్లుగా ఛాన్సులు దక్కించుకోవడమే గొప్ప.. అలాంటిది స్టార్ హీరోయిన్గా ఎదగాలంటే ఎంత రాసిపెట్టి ఉండాలి. అలాంటి స్టార్ స్టేటస్‌ను చాలా సులువుగా సొంతం చేసుకుంది చెన్నై చిన్నది సమంత. సమంత కెరీర్ రాకెట్ స్పీడ్‌తో వెళ్లిపోయింది.
ఐదారేళ్లు అయితే సౌత్ సినిమాను ఆమె నయనతార, అనుష్కను కాదని మరీ ఏలేసింది. అయితే చైతుతో పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాలు చేయడం ఆపలేదు. ఇప్పుడు విడాకుల తర్వాత మరింత స్పీడ్‌తో ఉంది. విడాకుల తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తోన్న సమంత ఇప్పుడు 12 ఏళ్ల క్రితం తన తొలి సినిమా షూటింగ్ టైంలో ఏం జరిగిందో అన్న విషయాన్ని ఇన్ స్టా పోస్ట్ ద్వారా గుర్తు చేసుకుంది. ఈ పోస్ట్ ఆమె కొద్ది రోజుల క్రితమే పెట్టినా కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది.
సమంత విడాకుల తర్వాత బాలీవుడ్, హాలీవుడ్‌పై కూడా కాన్సంట్రేషన్ చేస్తోంది. బాలీవుడ్లో బోల్డ్ వెబ్ సీరిస్‌లకు కూడా ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇక తెలుగులో శాకుంతలం, యశోద సినిమాలతో పాటు కోలీవుడ్‌లో కార్తీ హీరోగా ఓ సినిమా చేస్తోంది. ఇక సమంత ఓ హాలీవుడ్ మూవీలో నటించేందుకు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా ఆడిషన్స్‌కు ఆమె వెళ్లింది.
ఈ క్రమంలోనే 12 ఏళ్ల క్రితం చైతు పక్కన ఆమె నటించిన తొలి సినిమా ఏ మాయ చేశావే సినిమా టైంలో మాత్రమే తాను ఆడిషన్స్ ఇచ్చానని.. ఆ తర్వాత ఏ సినిమాకు ఆడిషన్స్ ఇవ్వలేదని.. ఇప్పుడు
ది అరెంజ్ మెంట్ ఆఫ్ లవ్ కోసం మరోసారి ఆడిషన్ ఇవ్వాల్సి వచ్చిందని నాటి సంఘటన గుర్తు చేసుకుంది. తన తొలి సినిమా ఆడిషన్స్ టైంలో ఎంత భయపడ్డానో.. ఇప్పుడు కూడా అంతే భయపడ్డాను అని గత స్మృతులు గుర్తు చేసుకుంది.