గౌతమి.. నాలుగు దశాబ్దాలుగా సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్గా ఉన్నారు. గౌతమి సినిమాల పరంగా తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి మార్కులే వేయించుకున్నారు. అయితే ఆమె వ్యక్తిగత కెరీర్ విషయంలో మాత్రం సరైన నిర్ణయాలు తీసుకోలేదు. గౌతమి తాడిమల్ల ఆంధ్రప్రదేశ్‌లో 1968 జూలై 2న జన్మించారు. గీతం వర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆమె తన పెదనాన్న కుమారుడు నిర్మించిన దయామయుడు సినిమాలో మొదటిసారిగా నటించారు.
ఆమె తెలుగు అమ్మాయి అయినా ఆమెకు తెలుగు కంటే తమిళ ఇండస్ట్రీలోనే ఎక్కువ పాపులారిటీ వచ్చింది. ఆమె తమిళంలో వరుస పెట్టి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. కోలీవుడ్ స్టార్ హీరోలు రజనీకాంత్ – కమల్‌హాసన్ పక్కన బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలు చేశారు. అప్పట్లో గౌతమి.. రేవతి, అమల, భానుప్రియ లాంటి హీరోయిన్లకు గట్టి పోటీ ఇచ్చారు.
వెండితెరపై అవకాశాలు తగ్గాక ఆమె సీరియల్స్‌లో కూడా నటించారు. కోలీవుడ్‌లో ప్రసారం అయిన ఇందిర సీరియల్లో ఆమె కీలక పాత్రలో కనిపించారు. అలాగే సన్ టీవీలో ప్రసారం అయిన టాక్ షోకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు. ఇక లేట్ ఏజ్‌లో కోలీవుడ్ సీనియర్ హీరో కమల్‌హాసన్‌తో కొన్నేళ్ల పాటు ఆమె సహజీవనం చేసి వార్తల్లో నిలిచారు. గౌతమి క్యాన్సర భారీన పడినప్పుడు కూడా కమల్ ఆమెకు దగ్గరుండి వైద్యం చేయించడంతో పాటు ఆమె కోలుకునేవరకు వెన్నంటే ఉన్నారు.
తాను ఎంతో అన్యోన్యంగా ఉన్న కమల్‌తో ఆమె బ్రేకప్ చెప్పడం పెద్ద షాకింగ్ నిర్ణయంగా మారింది. శృతీహాసన్ వల్లే గౌతమి.. కమల్‌కు దూరమైందని అంటారు. ఇక గౌతమి తన మొదటి భర్త సందీప్ భాటియాకు విడాకులు ఇచ్చేసింది. వీరు 1998లో పెళ్లి చేసుకుని 1999లోనే విడాకులు తీసేసుకున్నారు. 2000లో కమల్‌కు దగ్గరైన ఆమె కమల్‌తో 2004 నుంచి 2016 వరకు అంటే 12 ఏళ్ల పాటు పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేశారు.
కమల్‌కు దూరమైనప్పుడు గౌతమి సంచలన వ్యాఖ్యలు చేశారు. కమల్ తనను ఆర్థికంగాను, శారీరకంగాను వాడుకుని.. తనకు రూపాయి బిల్ల కూడా ఇవ్వలేదంటూ ఆమె మీడియా ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక గౌతమి మొదటి భర్త భారతీయ ఫైనాన్షియల్ ఎనలిస్ట్. ఆయన ఫైనాన్షియల్ ఎనలిస్టుగా ఎంతో పేరు తెచ్చుకున్నారు.. ప్రతి రోజూ బుల్లితెరపై కనిపిస్తూనే ఉంటారు. భాటియాతో 1999లో సుబ్బలక్ష్మి అనే ఓ పాపకు కూడా గౌతమి జన్మనిచ్చింది.