బుల్లితెర టీవీ యాంకర్లలో దేవీ నాగవల్లి ఒకరు. టీవీ 9 న్యూస్ రీడర్‌గా, యాంకర్‌గా దేవీ నాగవల్లి తెలుగు ప్రేక్షకులకు బాగా పాపులర్. రాజకీయాలు అయినా, సామాజిక అంశాలు అయినా తన వాగ్దాటితో నాగవల్లి వీక్షకులను మెప్పిస్తుంది. ఆమె స్వస్థలం రాజమండ్రి. జర్నలిజం వైపు మక్కువతోనే ఆమె న్యూస్ ఛానెల్స్లోకి వచ్చింది. టీవీ 9లో బాగా పాపులర్ అయిన నాగవల్లి.. ఆ తర్వాత బిగ్‌బాస్ హౌస్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ముక్కుసూటిగా ఉండే నాగవల్లి హౌస్‌లో ఎక్కువ రోజులు ఉండేలేకపోయింది.
ఇక నాగవల్లి ఈ జర్నలిజం ఫీల్ట్పై మక్కువతోనే తన వ్యక్తిగత జీవితం కూడా వదులుకుంది. చివరకు తన భర్తను కూడా వదులుకుంది. ఈ విషయాన్ని ఆమే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇక్కడ రిపోర్టర్‌గా ఎదుగుతోన్న క్రమంలో.. ఆమె మంచి పేరు ఉన్న టైంలోనే ఇంట్లో వాళ్లు అమెరికా సంబంధం అని ఆమెను ఒత్తిడి చేసి మరీ పెళ్లి చేసేశారు. అక్కడకు వెళ్లిన వెంటనే ప్రెగ్నెన్సీ .. ఓ బాబు పుట్టాడు. అయితే ఆమె మనసంతా ఇక్కడే ఉంది.
ఎందుకోగాని ఆమె తన భర్తతో పాటు ఆయన ఫ్యామిలీతో కనెక్ట్ కాలేపోయింది. అయితే ఇందులో తన మాజీ భర్త తప్పేం లేదని.. వాళ్లు మంచివాళ్లే అని చెప్పింది. తాను అమెరికాలో ఉండలేకపోయానని.. తన మనసంతా ఇక్కడే.. ఈ జర్నలిజం చుట్టూనే ఉండేదని.. ఓ రోజు ధైర్యం చేసి.. తనకు అక్కడ ఉండడం ఇష్టం లేదన్న విషయాన్ని తన భర్తకు చెప్పేశానని తెలిపింది. తాను అక్కడ ఉండలేను… తన భర్తకు కనెక్ట్ కాలేకపోతున్నా అన్న విషయాన్ని వాళ్లకు చెపితే ఎవరైనా ఏమైనా అనుకుంటానని కొద్ది రోజులు వెయిట్ చేశానని.. ఓ రోజు ధైర్యం చేసి ఈ విషయం చెప్పేశానని నాగవల్లి చెప్పింది.
అమెరికాలో తాను పెళ్లయ్యాక ఇంట్లోనే ఉండాల్సి వచ్చిందని.. అసలు ఆ జీవితమే తనకు నచ్చలేదని.. తనకు బయటకు వెళ్లడం.. తిరగడం.. సమాజంతో మమైకమై ఉండడం మాత్రమే ఇష్టమని చెప్పింది. చివరకు వాళ్లు కూడా తన నిర్ణయానికి ఓకే చెప్పారని.. 6 నెలల్లో మ్యూచువల్ డైవర్స్ వచ్చేశాయని తన జీవితంలో జరిగిన సంఘటనలు చెప్పింది. ఇక ఆమె భర్తకు విడాకులు ఇచ్చేసి ఇండియాకు తిరిగి వచ్చాక ఆమె రిపోర్టింగ్‌లోనూ, అటు న్యూస్ యాంకర్‌గాను ఎలా విజృంభిస్తుందో ? చూస్తూనే ఉన్నాం.