టైటిల్: వలీమై
నటీనటులు: అజిత్ కుమార్, కార్తికేయ, హుమా ఖురేషి, బాణి, సుమిత్ర తదితరులు
ఎడిటింగ్: విజయ్ వేలుకుట్టి
సినిమాటోగ్రఫీ: నీరవ్ షా
సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా
నిర్మాత: బోనీ కపూర్
దర్శకత్వం : హెచ్ వినోద్
రిలీజ్ డేట్: 24 ఫిబ్రవరి, 2022
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ వలిమై. తెలుగులో కార్తీ హీరోగా డబ్ అయిన ఖాకీ సినిమా దర్శకుడు సీహెచ్. వినోద్ డైరెక్ట్ చేసిన ఈ భారీ యాక్షన్ సినిమాను బోనీకపూర్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. రిలీజ్‌కు ముందు ట్రైలర్‌తో సంచలనాలు రేపిన ఈ సినిమా ఎలా ఉందో TL సమీక్షలో చూద్దాం.
కథ:
వైజాగ్‌లో సైతాన్ అనే బ్యాచ్ డ్రగ్స్ దందాలు, చైన్ స్నాచింగ్‌లు, హత్యలతో నగరాన్ని భయబ్రాంతులకు గురి చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే వైజాగ్‌కు వచ్చిన పోలీస్ ఆఫీసర్ అర్జున్ ( అజిత్), ఈ కేసును ఎలా డీల్ చేశాడు ? సైతాన్ బ్యాచ్ వెనక ఉన్న లీడర్ ఎవరు ? ఈ బ్యాచ్‌కు నరేన్ ( కార్తీకేయ గుమ్మంకొండ)కు ఉన్న లింక్ ఏంటి ? అర్జున్ ఫైనల్గా ఈ కేసు ఎలా ? చేధించాడు అన్నదే స్టోరీ.
విశ్లేషణ :
ఈ సినిమా నేపథ్యం చాలా బాగుంది. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు సినిమాకు కావాల్సినంత కమర్షియల్ మసాలా బాగా దట్టించడంలో వినోద్ సక్సెస్ అయ్యాడు. ఫైట్స్, ఎలివేషన్లు, యాక్షన్ సీన్లు బాగున్నాయి.
అజిత్ బాడీ లాంగ్వేజ్, బైక్ స్టంట్స్, రేసీ సీన్స్, బీజీఎం అన్నీ బాగున్నాయి. కార్తీకేయ నటన కూడా చాలా ప్లస్. ఇక రేసింగ్ సన్నివేశాలు చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అనేలా ఉన్నాయి. బాలీవుడ్ హీరోయిన్ హుమా ఖురేషి తక్కువ సీన్లకే పరిమితం అయినా ఆకట్టుకుంది. అయితే సినిమాలో పాత్రలు, నేపథ్యం బాగున్నా.. ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ ఆశించిన స్థాయిలో లేవు. ఇక కథను ఎలివేట్ చేసే క్రమంలో వినోద్ రాసుకున్న ట్రీట్‌మెంట్ కొన్ని చోట్ల లాజిక్‌గా ఉండి ఉంటే ఇంకా బాగుండేది.
సెకండాఫ్‌లో కాస్త లాగ్ ఎక్కువ అయ్యింది. అది ట్రిమ్ చేసి ఉంటే సినిమాకు మరింత హెల్ప్ అయ్యేది. కొన్ని సీన్లు మరీ స్లోగా ఉండడం, బోరింగ్‌గా సాగే తల్లి సెంటిమెంట్ ఇబ్బంది పెట్టాయి. ఇక టెక్నికల్‌గా చూస్తే యువన్‌శంకర్ రాజా సంగీతం అదిరిపోయింది. నేపథ్య సంగీతం ఎక్స్‌లెంట్. ఇక ఎడిటింగ్‌లో సెకండాఫ్‌లో కొన్ని సీన్లు ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. విజువల్స్ కళ్లుచెదిరేలా ఉన్నాయి. బోనీకపూర్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్‌గా..
ఓవరాల్‌గా వలిమై పర్‌ఫెక్ట్ యాక్షన్ ప్యాక్‌డ్ థ్రిల్లర్
వలిమై TL రేటింగ్: 2.5 / 5