2005లో వచ్చిన దేవదాసు సినిమాలో ఇలియానాను చూసిన తెలుగు యూత్ ఆమె ఇచ్చిన కిక్‌తో పిచ్చెక్కిపోయారు. ఇలియానా ఏంటి ఈ అందం ఏంటని తమను తామే మైమరచిపోయారు. ఇక అప్పట్లో అమ్మాయిలను ఎవరైనా పొగడాలి అంటే ఇలియానాలా ఉన్నావు అంటూ పొగడ్తలతో ముంచేత్తేవారు. ఇక ఆమె సన్నని నాజూకూ నడుముకు అయితే కుర్రోళ్లు పడిపోయేవారు. దేవదాసు ఏకంగా 175 రోజులు ఆడిందంటే మామూలు సంచలనం కాదు.. ఆ సినిమా విజయంలో ఇలియానా క్రెడిట్ చాలా ఉంది.
అప్పట్లో సన్నని నడుమున్న అమ్మాయి ఎవరు కనిపించినా ఇలియానాతోనే పోల్చేవారు. టాలీవుడ్లోనే ఆమె మొదటిగా కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంది. తెలుగు వాళ్లు ఆమెను నెత్తిన పెట్టుకున్నారు. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. ఎన్టీఆర్ – మహేష్‌బాబు – అల్లు అర్జున్ – పవన్ కళ్యాణ్ – రవితేజ ఇలా వరుస పెట్టి క్రేజీ హీరోల పక్కన క్రేజీ కాంబోలలో ఆఫర్లు దక్కించుకుంది.
అలాంటి ఇలియానా ఇక్కడ టాప్ రేంజ్లో ఉండగానే బాలీవుడ్లో రాణించాలని అక్కడకు చెక్కేసింది. అక్కడ ఛాన్సులు రాలేదు. ఆమె క్లిక్ కాలేదు. తప్పు తెలుసుకుని తిరిగి తెలుగులోకి వచ్చేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక్కడ కుర్ర హీరోయిన్లతో ఆమెకు పోటీ ఎక్కువైంది. ఆమె ఫిజిక్ చెదిరిపోయింది. అప్పటికే సినిమాటోగ్రాఫర్ ఆండ్రూతో డేటింగ్లో ఉన్న ఆమె కెరీర్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేసేసింది.
ఆ తర్వాత ఆమె రవితేజ సినిమా చేసినా డిజాస్టర్.. ఇప్పుడు ఇలియాను చూస్తోన్న వారు వామ్మో ఇలియానేనా అంటున్నారు. అసలు ఆమె ఫిజిక్.. ఆమె లావు చూసిన వారు దేవుడా అని దండం పెట్టేస్తున్నారు. ఆమె తాజాగా షేర్ చేసిన రెడ్ బికినీ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరికొందరు మాత్రం తాము ఎంతో ఆరాధించి, అభిమానించిన ఇలియానాను అసలు ఇలా చూస్తామని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తోన్న ఎమోజీలతో ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
ఇలియానా నడుము, ఆమె బికినీ, వెయిట్ గురించి సోషల్ మీడియాలో మీమ్స్ బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె అభిమానులు మాత్రం ఆమె గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని.. ఆమె ఇప్పుడు సినిమాల్లోకి వచ్చినా కూడా ఆమె సినిమాలు చూస్తామని కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ఇలియానా ఎంతలా ఫేడవుట్ అయ్యిందో ఈ ఫొటోలు చెపుతున్నాయి.