మనిషి జీవితంలో పుట్టుక అయినా చావు అయినా ఒక్కసారే వస్తుంది. అలాగే వైవాహిక బంధం కూడా ఎవరికి అయినా ఒక్కసారే వస్తుంది. అయితే పైన చెప్పుకున్న ఒక్కసారే అనేది పుట్టుక, చావు విషయంలో మాత్రమే ఉంటోంది. ఇప్పుడు వైవాహిక జీవితంలో పెళ్లి అనేది ఒక్కసారే అన్న పదానికి అర్థం పోయింది. ఇప్పుడు జీవితంలో ఒక్కరికి రెండు, మూడు పెళ్లిళ్లు కూడా జరుగుతున్నాయి. తొలి పెళ్లితో సంతృప్తి చెందని వారో.. లేదా భార్య లేదా భర్తను కోల్పోయిన వారు మిగిలిన జీవితాన్ని ఆనందమయం చేసుకునేందుకు మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు.
అయితే కొందరికి రెండో పెళ్లి కూడా కలిసి రావడం లేదు. దీంతో వైవాహిక జీవితం మీద విరక్తి వచ్చేసి ఓవరాల్‌గా దాంపత్య జీవితానికే దూరం అవుతున్నారు. అలాంటి వారిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి కూడా ఒకరు. విజయనగరం జిల్లాల్లో హరికథా కుటుంబానికి చెందిన అమ్మాయి కళ్యాణి. ఆమె చిన్నప్పటి నుంచే హరికథలు చెప్పేవారు. అలా నాటక రంగం మీద ఇష్టంతో ఆమె సినిమాల్లోకి కూడా వచ్చారు.
ఆమె ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన పెళ్లిళ్ల గురించి చెప్పారు. తనను ప్రేమ పేరుతో కొందరు వాడుకుని మోసం చేశారని.. అయితే తనకు నిజమైన ప్రేమ మాత్రం ఎక్కడా లభించలేదని వాపోయింది. కేవలం అమ్మ అని పిలిపించుకునేందుకే తాను రెండు సార్లు పెళ్లి చేసుకున్నానని ఆమె చెప్పింది. భార్య అంటే వండి పెట్టాలి.. ఇంట్లోనే అణిగి ఉండాలి.. ఏం మాట్లాడకూడదు అనే వాళ్లు ఎంతో మంది ఉంటారని. కానీ తాను అలాంటిదాన్ని కాదని కల్యాణి చెప్పింది.
తాను ముందు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని మోసపోయానని.. ఆ తర్వాత మళ్లీ వివాహం చేసుకున్న వ్యక్తి తాను కేవలం ఇంట్లోనే ఉండాలని.. తనకు, తన కుమారుడికి వండి పెట్టాలన్న కండీషన్లు పెడుతూ ఉండేవాడని.. అతడి ప్రవర్తిన నచ్చకపోవడంతోనే తాను విడాకులు ఇచ్చేశానని కళ్యాణి తెలిపింది. తన భర్త తనను ఎప్పుడూ తాగి వచ్చి కొట్టడంతో పాటు అనుమానించేవాడని.. ఇలాంటి భరించ లేకే రెండో భర్తను కూడా వదిలేశానని ఆమె చెప్పింది.
ఈ బాధలు భరించలేక ఒకానొక టైంలో తాను చనిపోదాం అని కూడా అనుకున్నానని.. కొన్ని నిద్రమాత్రలు కూడా మింగానని ఆమె ఆవేదనతో తన జీవిత బాధలు చెప్పుకువచ్చింది.