నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ జోష్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటించిన అఖండ ఏకంగా 103 కేంద్రాల్లో 50 రోజులు ఆడడంతో పాటు థియేట్రికల్‌గానే రు. 150 కోట్ల గ్రాస్ వసూళ్లు సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు బాలయ్య మలినేని గోపీచంద్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది.
శృతీహాసన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో కోలీవుడ్ సీనియర్ హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్ మరో కీలక పాత్రలో కనిపిస్తోంది. శాండల్‌వుడ్ హీరో దునియా విజయ్ మరో పాత్రలో కనిపిస్తున్నాడు. అఖండ తర్వాత బాలయ్య ఏ డైరెక్టర్‌తో సినిమా చేస్తాడు ? ఎలాంటి కథతో సినిమా చేస్తాడు ? అన్న ఆసక్తి ఉండేది. ఏ మాత్రం ఆ అంచనాలకు తగ్గకుండానే బాలయ్య మాస్ చిత్రాల దర్శకుడు మలినేని గోపీచంద్‌తో ఊరమాస్ సినిమాకే కమిటైపోయాడు.
ఇక ఈ సినిమాకు కూడా థమనే స్వరాలు అందిస్తుండగా.. కంటిన్యూగా షూటింగ్ చేసి వచ్చే దసరాకు రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కూడా చాలా మాసీవ్‌గా బాలయ్య స్టైల్లో ఉంది. ఈ సినిమాలో కూడా బాలయ్య తనకు కలిసొచ్చినట్టుగానే డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమాలో రాయలసీమలో ఓ ప్రాంతంలో నీటి సమస్యపై పోరాటం చేసే తండ్రి, కొడుకులుగా బాలయ్య రెండు పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తోంది.
ఈ లైన్ అయితే అదిరిపోయేలా ఉంది. ఇక సినిమా టేకింగ్ ఎలా ఉంటుందన్నదే చూడాలి. మలినేని గోపీచంద్‌కు యాక్షన్ తరహా మాస్క కనెక్ట్ అయ్యే సినిమాలు తెరకెక్కించడం చాలా ఈజీ. మరి ఈ సినిమాతో బాలయ్య లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న హీరోను ఎలా హ్యాండిల్ చేస్తాడు ? అన్నదే చూడాలి.