పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ ప్రీమియర్ షోలు మరికొద్ది గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా స్టార్ట్ కానున్నాయి. పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి కలిసి నటించిన సినిమా కావడంతో అంచనాలు మామూలుగా లేవు. ఇప్పటికే మల్లూవుడ్‌లో సూపర్ హిట్ అయిన సినిమా కావడంతో కథ విషయంలో కూడా చిత్ర యూనిట్ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉంది. ఇక ఈ సినిమాకు తెరవెనక బ్యాక్ బోన్‌గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నా కూడా డైరెక్టర్ సాగర్‌కె. చంద్ర.
సాగర్ కె. చంద్ర ఈ పేరు టాలీవుడ్‌లో మరీ అంత పాపులర్ కాదు.. ఎప్పుడు అయితే పవన్ కళ్యాణ్ సినిమాను డైరెక్ట్ చేశాడో ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. ఇక రేపు ఈ సినిమా రిలీజ్ అవుతోన్న వేళ అసలు సాగర్ ఎవరు ? అతడి నేపథ్యం ఏంటో తెలుసుకునేందుకు సినీ అభిమానులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.
ఇక సాగర్ కె. చంద్ర స్వస్థలం తెలంగాణలోని నల్గొండ జిల్లా. వీరి తండ్రి రామచంద్రారెడ్డి. నల్లగొండలో నేతాజీ హైస్కూల్ వీరిదే. ఇక తాను సినిమా రంగంలో ఇన్నేళ్ల కష్టపడి ఈ రోజు పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేసే స్థాయికి రావడం వెనక తన కుటుంబ కష్టం ఎంతో ఉందని చెప్పాడు. తన తండ్రి రామచంద్రారెడ్డితో పాటు తన తల్లి సునీత కూడా స్కూల్ బాధ్యతలు చూసుకుంటారని.. తన ప్రయాణంలో చెల్లి గౌతమి, భార్య గీత ఎంతో తోడ్పాడు అందించారంటూ వారికి తన ధన్యవాదాలు తెలిపారు.
సాగర్ కె. చంద్ర పవన్ కళ్యాణ్‌కు స్వతహాగా వీరాభిమాని. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసిన సాగర్ సినిమా రంగంపై ఆసక్తితో ఇండియాకు వచ్చి ఇండస్ట్రీలోకి వెళ్లాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తోన్న టైంలో 2011లో పంజా సినిమా ఆడియో ఫంక్షన్‌కు వెళ్లేందుకు ఎట్టకేలకు ఓ పాస్ సంపాదించాడట. ఎలాగైనా పవన్ కళ్యాణ్‌ను చూడాలని అక్కడకు వెళ్లాడట. అయితే అక్కడ క్రౌడ్‌లో సాగర్‌ను మూడు సార్లు తోసి కిందపడేశారు.
ఏ పవన్ అభిమానో ఇప్పుడు అదే పవన్‌ను డైరెక్ట్ చేసే స్థాయికి సాగర్ చేరుకున్నాడు. ఇక సాగర్ అంతకు ముందు రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చిన అయ్యారే సినిమాతో పాటు నారా రోహిత్ – ప్రేమ ఇష్క్ కాదల్ ఫేం శ్రీవిష్ణు హీరోలుగా నటించిన అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలను తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాలు వైవిధ్యమైన సినిమాలుగా ప్రశంసలు దక్కించుకున్నాయి.