Moviesఈ స్టార్లు సినిమాల్లో సూప‌ర్‌హిట్‌.. రాజ‌కీయాల్లో అట్ట‌ర్‌ప్లాప్‌..!

ఈ స్టార్లు సినిమాల్లో సూప‌ర్‌హిట్‌.. రాజ‌కీయాల్లో అట్ట‌ర్‌ప్లాప్‌..!

సినిమాల‌కు రాజ‌కీయాల‌కు లింక్ అనేది నాలుగు ద‌శాబ్దాల‌కు ముందు నుంచే ఉంది. బాలీవుడ్ క‌న్నా సౌత్ లో ఈ బంధం బాగా ఎక్కువ‌. నార్త్‌లో కూడా కొంద‌రు సినిమా వాళ్లు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఎంపీలు, ఎమ్మెల్యేలుగా లేదా రాజ్య‌స‌భ స‌భ్యులుగా మాత్ర‌మే వెళ్లారు. అయితే సౌత్‌లో ఏకంగా ముఖ్య‌మంత్రులు అయ్యారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్టీఆర్ సీఎం అయితే త‌మిళ‌నాడులో ఎంజీఆర్‌, జ‌య‌లలిత‌, సినిమా ర‌చ‌యిత క‌రుణానిధి ముఖ్య‌మంత్రులు అయ్యారు. అయితే కొంద‌రు మాత్రం సినిమా రంగంలో స్టార్ హీరోలుగా ఉన్న‌ప్ప‌ట‌కి పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చి డిజాస్ట‌ర్ అయ్యారు. ఇలా పొలిటిక‌ల్‌గా ప్లాప్ అయిన సినిమా స్టార్లు ఎవ‌రో చూద్దాం.

1)చిరంజీవి
సినిమా రంగంలో మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ప్లాప్ అయ్యారు. 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి 2009 ఎన్నికల బరిలో నిలిస్తే కేవ‌లం 18 సీట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. ఎమ్మెల్యేగా తిరుప‌తి – పాల‌కొల్లులో పోటీ చేసిన చిరంజీవి సొంత జిల్లా పాల‌కొల్లులో ఓడిపోయారు. తిరుప‌తిలో మాత్ర‌మే ఆయ‌న గెలిచారు. త‌ర్వాత త‌న పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి రాజ్య‌స‌భ‌కు ఎంపికై.. కేంద్ర మంత్రిగా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత రాజ‌కీయాల‌కు దూరం అయిపోయారు.

2) కమల్ హాసన్
విశ్వనటుడు కమల్ హాసన్ న‌ట‌కు నాలుగు ద‌శాబ్దాలుగా ఫిదా కాని వాళ్లు లేరు. ఆయ‌న భార‌తీయుడు సినిమాకు దేశం అంతా ఫిదా అయిపోయింది. అయితే రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన క‌మ‌ల్ ప్లాప్ అయ్యారు. చివ‌ర‌కు కోయంబ‌త్తూరు సౌత్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయ‌న కూడా బీజేపీ అభ్య‌ర్థి వ‌న‌తి శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు.

 

3) పవన్ కళ్యాణ్
మెగాస్టార్ రాజకీయాలకు గుడ్ బై చెప్పగా ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ 2014లో పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చి జ‌నసేన పార్టీ స్థాపించారు. ఆ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ పోటీ చేయ‌కుండా బీజేపీ – టీడీపీకి స‌పోర్ట్ చేశారు. 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన సొంతంగా పోటీ చేసి ఒక్క రాజోలు సీటుతో మాత్ర‌మే స‌రిపెట్టుకుంది. ఇక తాను పోటీ చేసిన భీమ‌వ‌రం, గాజువాక‌లో కూడా ప‌వ‌న్ ఓడిపోయారు. అయితే ప‌వ‌న్ పొలిటిక‌ల్‌గా మాత్రం యాక్టివ్‌గా ఉంటూ త‌న ల‌క్ ప‌రీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు.

4) విజయ్ కాంత్
తమిళ హీరో విజయ్ కాంత్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అప్ప‌ట్లో విజ‌య్‌కాంత్ సినిమాలు వ‌స్తున్నాయంటూ త‌మిళ మాస్ జ‌నాలు ఉర్రూత‌లూగిపోయేవారు. అయితే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక విజ‌య్‌కాంత్ జ‌య‌ల‌లిత ఉన్న‌ప్పుడు అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని ఎమ్మెల్యేగా గెలిచారు. త‌ర్వాత అడ్ర‌స్ లేకుండా పోయారు.

5)విజయశాంతి
తెలుగులో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు పెట్టింది పేరు లేడీ అమితాబ‌చ్చ‌న్‌ విజయశాంతి. త‌ల్లి తెలంగాణ పార్టీ పెట్టి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఆమె ఆ త‌ర్వాత ఆ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేసి మెద‌క్ ఎంపీ అయ్యింది. త‌ర్వాత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయాక ఆమె ఇప్పుడు బీజేపీలో చేరింది. ఆమె ఎన్ని పార్టీలు మారినా చేసిందేమి లేదు.

6) ప్రకాష్ రాజ్
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా సినిమాలతో సౌత్ ఇండియాలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో బెంగ‌ళూరు ఎంపీగా ఇండిపెండెంట్‌గా పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. రాజ‌కీయాలు ఆయ‌న‌కు క‌లిసి రాలేదు. ఇటీవ‌ల మా ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న ఓడిపోయారు.

7) రజినీకాంత్
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ త‌న సినిమాతో తిరుగులేని సూప‌ర్‌స్టార్ అయ్యాడు. అభిమానుల కోరిక మేర‌కు పార్టీ పెట్టాలి అనుకుంటోన్న టైంలో ఆయ‌న అనారోగ్యం పాల‌య్యాడు. ఆ త‌ర్వాత రాజ‌కీయాల‌కు పూర్తిగా దూరం అయిపోయారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news