Moviesబ‌న్నీ ఫిట్‌నెస్ సీక్రెట్లు ఇవే... డైలీ 45 నిమిషాలు అలా చేయాల్సిందే...!

బ‌న్నీ ఫిట్‌నెస్ సీక్రెట్లు ఇవే… డైలీ 45 నిమిషాలు అలా చేయాల్సిందే…!

టాలీవుడ్ స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోవ‌డంతో పాటు ఐకాన్ స్టార్‌గా మారిపోయాడు. సినిమా సినిమాకు బ‌న్నీకి యూత్‌లో విప‌రీత‌మైన క్రేజ్ పెరిగిపోతోంది. పాన్ ఇండియా మార్కెట్‌లో దూసుకుపోతోన్న బ‌న్నీ ఇప్పుడు ఐకాన్ స్టార్ అయిపోయాడు. అల వైకుంఠ‌పుర‌ములో – పుష్ప ది రైజ్ సినిమాల‌తో బ‌న్నీ రెండు వ‌రుస సూప‌ర్ హిట్లు త‌న ఖాతాలో వేసుకున్నాడు.

క‌రోనా పాండిమిక్ టైంలో రిలీజ్ అయిన పుష్ప ఏకంగా రు. 365 కోట్ల క‌ళ్లు చెదిరే వ‌సూళ్లు రాబ‌ట్టింది. బాలీవుడ్‌లోనే పుష్ప‌కు ఏకంగా రు. 100 కోట్ల వ‌సూళ్లు వ‌చ్చాయి. ప్రస్తుతం బ‌న్నీ పుష్ప -2 సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు బ‌న్నీ సినిమాల‌కు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ స‌మానంగా వ‌సూళ్లు వ‌చ్చేలా ఉంది.

ఇక బ‌న్నీ ఎప్పుడూ చాలా ఫిట్‌గా క‌నిపిస్తాడు. డ్యాన్సుల్లో బ‌న్నీ ఎన‌ర్జీ చాలా రాకింగ్‌గా ఉంటుంది. ఈ త‌రం జ‌న‌రేష‌న్లో ఎవ్వ‌రూ వేయ‌లేని స్టెప్పులు వేయండం బ‌న్నీకే సొంతం. కెరీర్ స్టార్టింగ్‌లో లుక్ ప‌రంగా బ‌న్నీ విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నా త‌ర్వాత త‌న‌ను తాను మార్చుకుని.. స్టైలీష్‌స్టార్‌గా ఎదిగిన తీరు అద్భుతం అనే చెప్పాలి. దేశ‌ముదురు సినిమాలో బ‌న్నీ చేసిన సిక్స్ ప్యాక్‌లుక్‌తో బ‌న్నీకి యూత్‌లో మాంచి క్రేజ్ వ‌చ్చింది.

ఇక షూటింగ్ ఉన్నా లేక‌పోయినా కూడా బ‌న్నీ ప్ర‌తి రోజు వ‌ర్క‌వుట్లు చేస్తాడ‌ట‌. ఇందులో చాలా క‌ఠిన‌మైన ట‌ఫ్ వ‌ర్క‌వుట్లు ఉంటాయ‌ని అంటున్నారు. డైలీ బ‌న్నీ 45 నిమిషాల నుంచి 50 నిమిషాల వ‌ర‌కు థ్రెడ్‌మిల్‌పై వ్యాయామం చేస్తాడ‌ట‌. బ‌న్నీ ఫిట్‌గా క‌నిపించ‌డానికి ఉన్న సీక్రెట్ల‌లో ఇది కూడా ఓ కార‌ణంగా క‌నిపిస్తోంది. ఇక పాత్ర‌కు త‌గిన విధంగా బ‌న్నీ చాలా క‌ష్ట‌ప‌డ‌తాడ‌ట‌.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news