ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కేవలం సినిమాలతో మాత్రమే కాకుండా రకరకాల ఆదాయ మార్గాలు వెతుక్కుంటారు. సినిమా రంగంలో తాము సంపాదించిన ఆస్తులను రియల్ ఎస్టేట్‌ల్లోనూ, ఇతర స్థిరాస్తుల వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఇక హీరోల కుటుంబ సభ్యులు కూడా రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి భారీగా వెనకేస్తూ ఉంటారు. ఒకప్పుడు సౌత్ ఇండియాలో స్టార్ హీరోగా, అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉన్న అరవింద్ స్వామి భార్య అపర్జ ముఖర్జీ వ్యక్తిగత జీవితం, ఆమె నెల సంపాదన గురించి ఎప్పటికప్పుడు కోలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంటుంది.
ఇప్పుడు సీనియర్ అయిన అరవింద్ స్వామి విలన్‌గా కూడా నటిస్తూ మెప్పిస్తున్నాడు. కోలీవుడ్‌తో పాటు తెలుగులో కూడా ప్రతినాయకుడి పాత్రల్లో మెప్పిస్తున్నాడు. ఆయన భార్య అపర్ణ ముఖర్జీ నెల సంపాదన, ఆమె వృత్తి, ఆమె పర్సనల్ లైఫ్ లో చాలా ఇంట్రస్టింగ్ విషయాలు ఉన్నాయి. భారతదేశంలోనే ప్రముఖ న్యాయవాదుల్లో అపర్ణా ముఖర్జీ ఒకరు. మన దేశంలోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఏ కోర్టులో అయినా వాదించే లైసెన్స్ ఆమె కలిగి ఉన్నారు.
దేశంలోనే బడా పారిశ్రామికవేత్తలకు, పలు కార్పొరేటర్ కంపెనీలకు ఆమె రకరకాలుగా సేవలు అందిస్తున్నారు. ఇందుకు ఆమెకు లక్షల్లోనే ఆదాయం లభిస్తోంది. ఇక తన భర్త అరవింద్ స్వామికి చెందిన పలు కంపెనీల బోర్డుల్లో డైరెక్టర్‌గాను, బయట కంపెనీలకు లీగల్ సలహదారుగా ఉంటూ భారీగా ఆర్జిస్తున్నారు. ఇవి కాక ఆమె సొంత కంపెనీల నుంచి కొంత ఆదాయం ఆమె వాటాగా వస్తుంది. ఓవరాల్‌గా నెలకు రు. 30 – 40 కోట్ల ఆదాయం అపర్జ ముఖర్జీకి అందుతుందట. ఓ స్టార్ హీరోయిన్‌కు భార్యగా ఉండి.. నెలకు ఈ రేంజ్‌లో ఆదాయం కూడబెట్టడం అంటే మామూలు విషయం కాదు.