Moviesప‌వ‌న్ క‌ళ్యాణ్ జానీతో పాటు డైరెక్ట్ చేసిన రెండో సినిమా.. ఇదే...

ప‌వ‌న్ క‌ళ్యాణ్ జానీతో పాటు డైరెక్ట్ చేసిన రెండో సినిమా.. ఇదే సీక్రెట్‌…!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన భీమ్లానాయ‌క్‌ సినిమా బాక్సాఫీసు దగ్గర రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. రానా – పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మల్టీ స్టారర్ సినిమాకు సాగ‌ర్ కె. చంద్ర దర్శకత్వం వహించారు. పవన్ కళ్యాణ్ కేవలం హీరో మాత్రమే కాదు.. ఆయనలో మరెన్నో కోణాలు దాగి ఉన్నాయి. ఆయన ఓ ఫైట్ మాస్టర్.. ఓ స్టోరీ రైటర్.. డైలాగ్ రైటర్. ఇక దర్శకుడు కూడా… ఇలా అన్ని విభాగాల్లోనూ పవన్ కు మంచి గ్రిప్ ఉంది.

 

తమ్ముడు సినిమాకు కొన్ని సూచనలు చేసిన పవన్ కళ్యాణ్ ఆ సినిమాతో పాటు ఖుషి సినిమాలో కొన్ని ఫైట్ల‌ను కూడా ఆయనే స్వయంగా కంపోజ్ చేసుకున్నారు. ఇక‌ జానీ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మెగా ఫోన్ పట్టారు. పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించిన సినిమా ఏది అంటే చాలామందికి జానీ పేరు మాత్రమే తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాతోనే పవన్ మెగాఫోన్ పట్టుకుని సంచ‌ల‌నం రేపారు. ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రెండు సంవత్సరాల సుదీర్ఘమైన గ్యాప్ తీసుకున్న పవన్ నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది.

జానీ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లోనూ పవన్ అభిమానులకు పెద్ద పీడకల లాంటిదే. ఆ సినిమా తర్వాత పవన్ మరోసారి ఏడాదిన్నరపాటు గ్యాప్ తీసుకొని గుడుంబా శంకర్ సినిమా చేశారు. అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై పవన్ సోదరుడు నాగబాబు స్వయంగా ఈ సినిమాను నిర్మించారు. మీరాజాస్మిన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. విచిత్రమేంటంటే గుడుంబా శంకర్ దర్శకుడు ఎవరు ? అన్న ప్రశ్నకు పవన్ అభిమానుల్లోనే చాలామందికి తెలియదు.

ఈ సినిమాకు బసవా వీర శంకర్ దర్శకత్వం వహించారు. అప్పటికే పెద్దగా పేరులేని వీరశంకర్ పవన్ ఇమేజ్ కి తగినట్లుగా ఆ సినిమాను ఏమాత్రం ఆసక్తికరంగా తీయ లేకపోయారు. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో మరో ప్రచారం కూడా ఉంది. గుడుంబా శంకర్ సినిమాకు పేరుకు మాత్రమే వీర‌శంకర్ దర్శకుడు తప్ప… ఆ సినిమాలో చాలా సన్నివేశాలు, ఫైట్లు కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నారని టాక్‌. పవన్ ఇన్వాల్‌మెంట్ ఎక్కువగా ఉండటంతోనే ఆ సినిమా చాలా వరకు సిల్లీగా తయారైపోయి ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు అని అంటారు.

జానీ సినిమాతో మెగా ఫోన్ పట్టిన పవన్ ఆ సినిమాకు అఫీషియల్ డైరెక్టర్ అయినా కూడా… గుడుంబా శంకర్ సినిమాకు ఆన‌ఫీసియల్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఆ తర్వాత పవన్ మరోసారి దర్శకత్వం చేయాలన్న ఆలోచన ఎప్పుడూ
చేయలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news