Moviesటాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను పెళ్లాడిన డైరెక్ట‌ర్‌కు అంత మంది హీరోయిన్ల‌తో ఎఫైరా...

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను పెళ్లాడిన డైరెక్ట‌ర్‌కు అంత మంది హీరోయిన్ల‌తో ఎఫైరా ?

సినిమా ఇండ‌స్ట్రీలో హీరోల‌కు, హీరోయిన్ల‌కు మ‌ధ్య లింకులు ఎలా ఉంటాయో ? హీరోయిన్ల‌కు, ద‌ర్శ‌కుల‌కు కూడా అలాంటి లింకులే ఉంటాయి. ఇటీవ‌ల కాలంలో హీరోలు, హీరోయిన్ల‌కు లింకుల క‌న్నా, హీరోయిన్లు, ద‌ర్శ‌కుల మ‌ధ్య లింకులు ఎక్కువ అవుతున్నాయి. ఓ స్టార్ డైరెక్ట‌ర్ స్టార్ హీరోతో సినిమా చేస్తున్నాడ‌నుకుంటే.. ఆ హీరోయిన్‌కు ఛాన్స్ ఇచ్చే క్ర‌మంలోనే వారిద్ద‌రు బాగా క్లోజ్ అవుతున్నారు. ఇప్పుడు ఎంత పెద్ద హీరో సినిమా అయినా హీరోయిన్ ఎంపిక బాధ్య‌త పూర్తిగా ద‌ర్శ‌కుడిదే కావ‌డంతో హీరోయిన్లు కూడా ద‌ర్శ‌కుల మాయ‌లో ప‌డుతున్నారు.

ఓ దర్శకుడు ఒక హీరోయిన్ తన సినిమాల్లో నటించిన సినిమా హిట్ అయితే ఆమెకే ప‌దే ప‌దే ఛాన్సులు ఇవ్వాల‌ని చూస్తూ ఉంటాడు. ఇది ఇప్ప‌టి నుంచి కాదు.. మ‌న తెలుగులోనే ద‌శాబ్దాల నుంచి కంటిన్యూ అవుతోంది. రాఘవేంద్ర రావు – శ్రీదేవి నుంచి దాసరి నారాయణరావు – జయసుధ, బాల‌చంద‌ర్ – స‌రిత ఇలా చాలా మంది హీరోయిన్లు, ద‌ర్శ‌కుల కాంబినేష‌న్లు అప్ప‌ట్లో రిపీట్ అయ్యేవి.

ఆ త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ – స‌మంత‌, త్రివిక్ర‌మ్ – పూజా హెగ్డే ఇలా హీరోయిన్లు, ద‌ర్శ‌కుల కాంబినేష‌న్లు రిపీట్ అవుతున్నాయి. ఈ కోవ‌లోనే టాలీవుడ్‌లో ఒక‌ప్పుడు సూప‌ర్ హిట్ సినిమాలు తీసిన ఓ స్టార్ డైరెక్ట‌ర్‌.. త‌న సినిమాలో న‌టించిన ఓ స్టార్ హీరోయిన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ డైరెక్ట‌ర్ త‌న సినిమాల‌లో ముగ్గురు హీరోయిన్ల‌ను ప‌దే ప‌దే రిపీట్ చేస్తూ సినిమాలు తీశాడు.

ఈ క్ర‌మంలోనే ఓ డైరెక్ట‌ర్ ఓ హీరోయిన్‌కు ఆమె కెరీర్ స్టార్టింగ్‌లో ఎక్కువ ఛాన్సులు ఇచ్చాడు. అప్ప‌ట్లో వారి మ‌ధ్య ఏదో ఉంద‌న్న ప్ర‌చారం బాగా జ‌రిగింది. ఓ సినిమాలో అయితే స‌ద‌రు హీరోయిన్‌ను మ‌రీ దారుణంగా చూపించాడు. ఆ త‌ర్వాత స్టార్ హీరోల‌తో స‌ద‌రు డైరెక్ట‌ర్ చేసిన సినిమాలోనూ ఆమే హీరోయిన్‌. అప్ప‌ట్లో ఎక్క‌డ చూసినా వారిద్ద‌రే ఉండేవార‌ట‌.

వారిద్ద‌రి మ‌ధ్య బంధం గురించి తెలిశాకే.. స‌ద‌రు డైరెక్ట‌ర్ భార్య అయిన సీనియ‌ర్ హీరోయిన్ భ‌ర్త‌కు విడాకులు ఇచ్చేస్తుంద‌న్న ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఇండ‌స్ట్రీలోని కొంద‌రు పెద్ద‌లు స‌ర్ది చెప్ప‌డంతో త‌ర్వాత మ‌ళ్లీ వారు క‌లిసి ఉంటున్నారు. స‌ద‌రు డైరెక్ట‌ర్‌కు దూరం అయ్యాక ఆ హీరోయిన్ ఇప్పుడు మ‌రో క్రేజీ డైరెక్ట‌ర్‌ను ప‌ట్టేసింది. ఇప్పుడు పెళ్లికూడా చేసుకోకుండా ఆ డైరెక్ట‌ర్‌తోనే అన్ని మొద‌లు పెట్టేసింది. ఇప్పుడు వాళ్లిద్ద‌రు క‌లిసి ఏకంగా సినిమాలు కూడా చేసేస్తున్నారు. ఇక ఆ హీరోయిన్ ఎవ‌రో ఈ పాటికే మీకు అర్థ‌మై ఉంటుంద‌నుకుంటా.. ?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news