ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతోన్న సినిమాలు అన్నీ భారీ లెవల్లో పాన్ ఇండియా రేంజ్‌లోనే తెరకెక్కుతున్నాయి. ఇందులో యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ కూడా ఒకటి. బాహుబలి సీరిస్ ఆ తర్వాత సాహో ఈ మూడు సినిమాలు కూడా ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్‌ను చేసేశాయి. ఈ మూడు సినిమాల తర్వాత ప్రభాస్ నటిస్తోన్న ఈ సినిమాపై లెక్కకు మిక్కిలిగా భారీ అంచనాలు ఉన్నాయి. 2019లో వచ్ఇన సాహో తర్వాత ప్రభాస్ నటించిన ఏ సినిమా కూడా రిలీజ్ కాలేదు. అంటే రెండున్నర సంవత్సరాలు దాటేసింది. ప్రభాస్ సినిమా కోసం అభిమానులు పిచ్చెక్కిపోయి ఉన్నారు.
ఇప్పుడు ప్రభాస్ ఓ నేషనల్ స్టార్. ఇక రాధే శ్యామ్ విషయానికి వస్తే పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా త్వరలోనే రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో వస్తుండడంతో ఏ చిన్న ఛాన్స్ కూడా మేకర్స్ వదులుకోవడం లేదు. ఇప్పటికే హిందీ వెర్షన్‌కు బాలీవుడ్ బిగ్‌బీ అమితాబచ్చన్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇది నార్త్‌లో రాధే శ్యామ్‌కు ఖచ్చితంగా ఎడ్వాంటేజ్ అవుతుంది.
ఇప్పుడు తెలుగులో నిర్మాతలు అదిరిపోయే ప్లాన్ వేశారు. రాధే శ్యామ్‌కు సూపర్ స్టార్ మహేష్‌బాబుతో కథ చెప్పిస్తున్నారట. మహేష్‌బాబు ఈ సినిమాకు తన గొంతు గాత్రం ఇస్తే ఖచ్చితంగా అది ప్లస్ అవుతుంది. ఇప్పటికే ఈ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. మహేష్‌బాబు అభిమానులు కూడా తమ హీరో వాయిస్ వినేందుకు ఉత్సాహంతో ఉన్నారు.
యూవీ క్రియేషన్స్ – గోపీ కృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మించే ఈ సినిమా పూర్వజన్మల వృత్తాంతంతో యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. సినిమాకు అధికారికంగానే రు. 250 కోట్ల బడ్జెట్ అయ్యిందని అంటున్నారు. అయితే సినిమా రెండేళ్ల పాటు షూటింగ్ జరుపుకోవడంతో వడ్డీలతో కలిపి ఇది రు. 300 కోట్లు దాటేసిందని అంటున్నారు.