మెగాస్టార్ చిరంజీవి ఆచార్య తర్వాత వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చుకుంటూ వెళుతున్నారు. ప్రస్తుతం ఆచార్య చేస్తోన్న చిరు ఆ తర్వాత వరుసగా మోహనరాజా దర్శకత్వంలో మళయాళ హిట్ సినిమా లూసీఫర్ రీమేక్ గాడ్ ఫాదర్లో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ వేదాళం ఆధారంగా భోళా శంకర్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత కేఎస్. రవీంద్ర ( బాబి) దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరు తాజా సినిమా టైటిల్ విషయం ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారింది. గతంలో ఇండస్ట్రీలో సినిమా టైటిల్స్ విషయంలో పెద్ద రచ్చే నడిచింది. మహేష్‌బాబు ఖలేజా – కళ్యాణ్‌రామ్ కత్తి – నాని గ్యాంగ్‌లీడర్ – గీతా ఆర్ట్స్ అర్జున్ – ఎన్టీఆర్ రచ్చ ఇలా పలు టైటిల్స్ చేతులు మారాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కోసం ఓ యంగ్ హీరో తన టైటిల్ త్యాగం చేయక తప్పలేదు.
బాబి డైరెక్షన్లో చిరు ఓ యాక్షన్ ఎంటర్టైనర్కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ ఓ మాసీవ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే సినిమా షూటింగ్ అయిన ఈ మూవీలో చిరంజీవి మాసీవ్ అవతార్‌లో గళ్ల లుంగీ కట్టుకుని రఫ్‌గా కనిపిస్తున్నాడు. ఈ ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేసింది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కే ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ అనుకున్నారు.
అయితే సుమంత్ హీరోగా వాల్తేరు శ్రీను పేరుతో ఓ సినిమా రాబోతోంది. ఇది చిరంజీవి సినిమాకు అనుకున్న వాల్తేరు వీరయ్యకు దగ్గరగా ఉంది. ఈ విషయం తెలుసుకున్న చిరు టీం వారిని టైటిల్ మార్చుకోమని రిక్వెస్ట్ చేశారట. దీంతో సుమంత్ మూవీ టీం కూడా తమ సినిమా టైటిల్ అనగనగా ఓ రౌడీ గా మార్చుకున్నారట. ఏదేమైనా సుమంత్ టైటిల్ విషయంలో కాంట్రవర్సీలకు చోటు లేకుండా మెగాస్టార్ కోసం తన సినిమా టైటిల్ త్యాగం చేశారు.