ఇటీవల కాలంలో బుల్లితెరపై ఎన్నో జంటలు బాగా పాపులర్ అవుతున్నాయి. వెండితెర జంటలను మించిన క్రేజ్ బుల్లితెర జంటలకు వచ్చేస్తోంది. ఈ లిస్టులో సుడిగాలి సుధీర్ – రష్మి జంట టాప్ ప్లేసులో ఉంటుంది. అసలు ఈ జంట బుల్లితెర మీద కనపించారంటే మామూలు రచ్చ ఉండదు. రష్మి – సుధీర్ రియల్ లైఫ్ జంట అయితే చాలా మంది ఫిదా అయిపోతారు. ఇక ఈ లిస్టులో వర్ష – ఇమ్మాన్యుయేల్ జంట కూడా బాగా పాపులర్ అయ్యింది. వీరు కూడా ఇటీవల సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నారు.
ఈ జంట కూడా ఎప్పటికప్పుడు ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్తపరుచుకుంటూ బాగా పాపులర్ అవుతున్నారు. వర్ష అయితే అందం కాదు.. మంచి మనస్సు ఉండాలని చెప్పిన డైలాగ్‌తో బాగా పాపులర్ అయ్యింది. ఇటీవల కాలంలో బుల్లితెరపై మరికొన్ని జోడీలు బాగా పాపులర్ అవుతున్నాయి. ఇక కొద్ది రోజుల్లో వేలంటైన్స్ డే పురస్కరించుకుని శ్రీదేవి డ్రామా కంపెనీ వారు ఓ స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే కొన్ని జంటలు కూడా ప్లాన్ చేశారు.
ముందు పంచ్ ప్రసాద్ ఆయన భార్య చేసిన స్కిట్‌కు అందరూ ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత దొరబాబు భార్య తన భర్తపై వస్తోన్న రూమర్లపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ అయితే స్టేజ్ మీద అందరూ చూస్తుండగానే సుజాతకు రింగ్ తొడిగేశాడు. సుజాత మాట్లాడుతూ నాకు మా నాన్న అంటే ఇష్టం.. ఆ తర్వాత నాకు భర్తగా వచ్చే వ్యక్తి నన్ను స్నేహితుడిగా చూసుకోవాలని చెప్పింది.
వెంటనే అందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసిన రాకేష్ సుజాతకు రింగ్ తొడిగేశాడు. ఆ తర్వాత రాకేష్ అమ్మా నిన్ను మీ అమ్మలా చూసుకునే అమ్మాయి దొరికిందని సుజాతను చూస్తూ చెపుతాడు. అందరూ చూస్తుండగానే స్టేజ్ మీద మోకాళ్ల మీద కూర్చొని సుజాతకు రింగ్ తొడిగేస్తాడు. ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.