సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళు కామన్. చాలా మంది హీరోలు హీరోయిన్ లు సినిమా షూటింగ్ టైంలో ప్రేమించుకుని..ఆ తరువాత ఇంట్లో పెద్దవాళ్లను ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నారు. అయితే వాళ్లలో కొంతమంది మాత్రమే ఇప్పటికి కలిసి ఉన్నారు. మరి కొందరు ఏవో మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకుని..జాలీగా బ్రతికేస్తుంటే..ఇంకొందరు మింగలేక కక్క లేక లొలోపలే గొడవలు పడుతూ ఆ మ్యాటర్ ను బయటకు రానివ్వకుండా మేనేజ్ చేస్తున్నారు.
తాజాగా అలాంటి మ్యాటటర్ నే ఒకటి లీకై నెట్టింట వైరల్ గా మారింది. ఈ మధ్యనే పెళ్ళి చేసుకున్న ఓ యంగ్ హీరోకి తన భార్య అప్పుడే చుక్కలు చూయిస్తుందనే వార్త నెట్టింట మారుమ్రోగిపోతుంది. నిజానికి ఈ యంగ్ హీరో చెప్పుకొతగిన హిట్ సినిమాలు చేయనప్పటికి..యాక్టింగ్ పరంగా మాత్రం అందరిని మెప్పించగలిగాడు. హీరోగానే కాదు ఒకటి రెండు సినిమాలో విలన్ పాత్రలు కూడా పోషించి వావ్ అనిపించాడు. ఇక ఇప్పుడిప్పుడే ఏవో కొన్ని బడా సినిమాల్లో విలన్ గా ఆఫర్లు వస్తున్న క్రమంలో సడెన్ గా పెళ్లి వార్త చెప్పి .. అందరికి షాక్ ఇచ్చాడు. సరే..పెళ్లి చేసుకున్న తరువాత అయినా హ్యాపీగా ఉన్నారా అంటే అది లేదట. ఏదో మూడు రోజుల ముచ్చటగా కొన్ని నెలలు బాగా ఎంజాయ్ చేసిన ఆ జంట మధ్య అప్పుడే గొడవలు స్టార్ట్ అయ్యాయట.
నిజానికి ఇక్కడ హీరో మంచి వాడే కానీ అమ్మాయి చాలా గారాభంగా పెరిగిందట. ఒక్కటే కూతురు కావడంతో..చాలా సున్నితంగా..గారాభంగా పెరిగిన ఈ అమ్మడు..మంచి సౌండ్ పార్టీనే. బాగా డబ్బులు కూడా ఉన్నాయి. ఇక్కడ హీరో పరిస్ధితి చూస్తే అంతంత మాత్రమే. ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా పడలేదు. దీంతో అమ్మడు..సదరు హీరో భర్తను సినిమాలు ఆపేసి..అమెరికా వెళ్లిపోదాం..అక్కడే జాబ్ చూసుకొని సెటిల్ అవుదాం అంటూ ఇంట్లో బాగా టార్చర్ చేస్తుందట.
ఇలా రోజు రోజుకి వాళ్ళ మధ్య గొడవలు ముదురిపోతున్న క్రమంలో యంగ్ హీరో భార్య..నీ ఫేస్ కి సినిమా అవకాశాలు రావు..వచ్చిన నువ్వు యాక్టింగ్ కు పనికి రావు..ఇన్ని ఏళ్లు ఇండస్ట్రీలో ఉంటూ ఏం పీకావు అంటూ వల్గర్ గా మాట్లాడి..ఆ హీరోని అవమానించిందట. ఇక్కడ షాకింగ్ ట్వీస్ట్ ఏమిటంటే..వీళ్లది..లవ్ మ్యారేజ్. పెళ్లికి ముందు కన్నా..బుజ్జి అంటూ ప్రేమగా మాట్లాడే ఈ అమ్మాయిలు..పెళ్లి తరువాత ఇలా ఎందుకు బీహేవ్ చేస్తారో తెలియదంటున్నారు ఈ విషయం తెలుసుకున్న కొందరు నెటిజన్స్. ఇక వీళ్ల మధ్య గొడవలు చూస్తుంటే ఇండస్ట్రీలో మరో విడాకుల వార్త త్వరలోనే వినబోతున్నాం అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.