టాలీవుడ్‌లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ తరం జనరేషన్ స్టార్ హీరోల్లో అందరికి హిట్లు ఇచ్చిన క్రెడిట్ పూరీకే దక్కుతుంది. చాలా స్పీడ్‌గా సినిమాలు ఫినిష్ చేయడంలో పూరికి సాటిరాగల డైరెక్టర్ ఎవ్వరూ ఉండరు. ఇక పూరి జగన్నాథ్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో దేశముదురు, ఇద్దరమ్మాయిలతో సినిమాలు వచ్చాయి. దేశముదురు అయితే సూపర్ బ్లాక్‌బస్టర్.. 2007 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా ఆ రోజుల్లోనే 90 + కేంద్రాల్లో 100 రోజులు ఆడి బన్నీ కెరీర్‌కు మంచి టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.
బన్నీకి జోడీగా హన్సిక నటించగా.. రమాప్రభ కామెడీ కూడా బాగా హైలెట్ అయ్యింది. ఇక ఈ సినిమా కథను ముందుగా హీరో సుమంత్‌కు వినిపించారట. పైగా దర్శకుడు త్రివిక్రమ్, పూరి ఇద్దరూ కలిసి వెళ్లి మరీ సుమంత్‌ను ఈ సినిమా చేయమని అడిగారట. అయితే హీరో సన్యాసినిని ప్రేమించడం ఏంటన్నది సుమంత్‌కు లాజికల్‌గా నచ్చలేదట. అయితే అప్పటకి దేశముదురు కథను బాగా ముదిరేలా కూడా వండలేదట. పూరి, త్రివిక్రమ్ జస్ట్ లైన్ మాత్రమే చెప్పారట. ఇక సుమంత్‌కు ఈ లైన్ పెద్దగా నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసేశాడట.
ఆ తర్వాత పూరి ఈ కథను పూర్తిగా రెడీ చేసుకుని వెళ్లి బన్నీకి వినిపించగా.. బన్నీ సింగిల్ టేక్‌లో ఓకే చేసేశాడు. అలా సుమంత్ రిజెక్ట్ చేయడంతో బన్నీ ఖాతాలో ఓ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ పడింది. నిజంగా ఆ సినిమా సుమంత్ చేసి ఉంటే.. సుమంత్ కెరీర్‌కు అది మంచి టర్నింగ్ పాయింట్ అయ్యి ఉండేది. సుమంత్‌కు మాస్‌లోనూ మంచి ఫాలోయింగ్ వచ్చి ఉండేది. ఇక సుమంత్ వరుసగా సినిమాలు చేస్తున్నా అవి సుమంత్ కెరీర్‌కు మాత్రం యూజ్ కాలేకపోతున్నాయి.
ఇక సుమంత్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే తొలిప్రేమ హీరోయిన్ కీర్తిరెడ్డిని ప్రేమవివాహం చేసుకున్నాడు. అయితే వారి మధ్య యేడాదికే మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత కీర్తిరెడ్డి మరో వివాహం చేసుకుని యూకేలో సెటిల్ అయిపోయింది. సుమంత్ మాత్రం ఇంకా అలాగే ఉంటూ సినిమాలు చేస్తూ కాలం గడిపేస్తున్నాడు.