సీనియర్ నటి సుధారెడ్డి..ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సీనియర్ నటి సుధారెడ్డి తెలుగు సినిమా ప్రేక్షకులకు రెండున్నర దశాబ్దాలకు పైగా తెలుసు. గత రెండున్నర దశాబ్దాలకు పైగా ఎన్నో సినిమాలో నటించి అలరించి తన నటనతో మెప్పించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఎన్టీఆర్ మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటించిన ఈమె తనదైన నటనతో మెప్పించి.. ఆ తర్వాత చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఆ సినిమాలో హీరో వదిన పాత్రతో అందరిని కంటతడి పెట్టించింది. ఇక అప్పటి నుంచి మన డైరెక్టర్స్ కు అమ్మ, అక్క, అత్త, వదిన పాత్రలు అంటే ఆమెనే గుర్తువస్తుంది.
నిజానికి ఈమె హీరోయిన్ అవుద్దామని ఇండస్టృఈలోకి వచ్చారట. కానీ సినిమాల్లోకి వచ్చిన వెంటనే ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆఫర్లు రావడంతో వదులుకోలేక అలా కెరీర్ స్టార్ట్ చేయడంతో ఆమె హీరోయిన్‌గా చేయలేకపోయారట. నటించి నలుగురిని మెప్పించాలి కానీ హీరోయిన్ అయిన తల్లి పాత్రైనా ఒక్కటే అనేది ఈమె అభిప్రాయం. సుమారు 975 సినిమాల్లో కనిపించి మెప్పించి తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించిన సుధ ఆల్ మోస్ట్ అందరి హీరోల పక్కన నటించింది. తమిళనాడులోని శ్రీరంగంలో పుట్టి పెరిగారు సుధ.. దర్శకుడు బాలచందర్ ప్రోత్సాహంతో సినిమాల్లోకి వచ్చారట. స్వతహాగా అమె తమిళ్ అయినప్పటికీ నటుడు అల్లు రామలింగయ్య సలహాతో తెలుగు బాగా నేర్చుకుని స్వంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారట.
రీసెంట్ ఇంటర్వ్యుల్లో ఆమె మాట్లాడుతూ ఇండస్ట్రీలో తనకు జరిగిన అవమానం గురించి చెపుతూ బాధపడింది. ఓ తమిళ్ సినిమా సాంగ్ షూటింగ్ టైంలో ఆ సాంగ్ ను కొరియోగ్రఫీ చేస్తున్న సుందరం మాస్టర్ ఆమె కి ఒక చిన్న డాన్స్ స్టెప్ చెప్పారట.. ఎంతట్రై చేసినా ఆ స్టెప్ ఆమెకి రాలేదట..దీంతో మాస్టర్ ఆమెను అందరిముంది తిట్టేసారట. ఛీ.. నువ్వు వ్యభిచారం చేయడానికి కూడా పనికిరావు అంటూ కోపడారట. దీంతో బాధపడుతూ ఇంటికి వెళ్లి ఇక నేను సినిమాలు చేయను అంటూ ఏడ్చేసిందట.
కానీ వాల్ల అమ్మ సర్ది చెపుతూ..రేపు నువ్వు అన్ని యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకున్నాక వాళ్ల నీ దగ్గరకు వస్తారు చూడు అంటూ చెప్పుకొచ్చిందట. అమ్మ చెప్పిన్నట్లుగానే ఓ సినిమాలో తల్లి పాత్ర కోసం సుందరం మాస్టర్ సుధ సంప్రదించారట. దీంతో మొదట నో చెప్పుద్దాం అనుకున్న ఆమె ..అమ్మ మాటలను గుర్తు చేసుకుని..ఫైనల్ గా సైన్ చేసిందట. ఆ సినిమా హిట్ అవ్వడం..ఆమె పాత్రకు మంచి పేరు రావడంతో సుందరం మాస్టర్ కూడా సుధను మెచ్చుకున్నారట.