ఒకే ఒక్క సినిమా.. అది తొలిసినిమా.. పైగా ప్లాప్ టాక్.. అయితేనేం ఆ హీరోయిన్ దశ మార్చేసింది.. మామూలుగానే దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కంట్లో పడిన ఏ హీరోయిన్‌కు అయినా పట్టిందల్లా బంగారం అన్న నానుడి నాలుగు దశాబ్దాల నుంచే ఉంది. అయితే ఈ వయస్సులో కూడా రాఘవేంద్రరావు చేయి పడిందంటే ఆ హీరోయిన్ గారెల బుట్టలో పడినట్టే అన్నది మరోసారి శ్రీలీల విషయంలో ఫ్రూవ్ అయ్యింది. పెళ్లిసందD సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ ర్యాంకు కోసం దూసుకుపోతోంది.
ఆమె దూకుడుకు ఇప్పట్లో బ్రేకులు పడే ఛాన్సులు కూడా కనపడడం లేదు. పెళ్లిసందD సినిమాకు ముందు ప్లాప్ టాకే వచ్చింది. అనూహ్యంగా ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ కొట్టింది. ఆ సినిమా ప్లాప్ అయినా కూడా శ్రీలీల అందానికి తెలుగు కుర్ర హీరోల నుంచి, స్టార్ హీరోల వరకు పడిపోయారు. శ్రీలీల ఖచ్చితంగా మా సినిమాలో ఉండాల్సిందే అని ఆశపడేంతగా ఆమె అందం మన స్టార్ హీరోలను చెదరగొట్టేసింది.
కట్ చేస్తే ఎన్టీఆర్ – కొరటాల సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం ముందుగా శ్రీలీల పేరును పరిశీలించారు. ఇప్పుడు ఆమె రెండో సినిమాకే రు. 40 లక్షలు, మూడో సినిమాకు రు. 70 లక్షల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది. అయితే ఇప్పుడు ఆమెకు మరో కళ్లు చెదిరే ఆఫర్ వచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – మహేష్‌బాబు కాంబినేషన్లో తెరకెక్కే సినిమాలో ఆఫర్ వచ్చిందట.
ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. అయితే ఇప్పుడు రెండో హీరోయిన్ పాత్ర కోసం శ్రీలీలను తీసుకున్నట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ – మహేష్ సినిమాలో ఛాన్స్ అంటే మామూలు విషయం కాదు. ఇందుకోసం ఆమెకు రు. 70 లక్షలకు పైగానే ఆఫర్ చేసినట్టు టాక్ ? ఈ సినిమాలో శ్రీలీల పాత్రకు చాలా ఇంపార్టెంట్ ఉండేలా త్రివిక్రమ్ డిజైన్ చేశారట. ఏదేమైనా శ్రీలీలకు వరుస టాప్ ఆఫర్లతో ఆమె జాతకం మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.