తెలుగు బిగ్‌బాస్ ఐదో సీజన్ కంటెస్టెంట్స్‌గా ఉన్న షన్నూ – సిరిల ప్రేమ వ్యవహారం పెద్ద వివాదాస్పదం అయ్యింది. వీరి మధ్య ప్రేమ ఉందా లేదా ? అన్నది పక్కన పెట్టేస్తే హౌస్‌లో వీరు నడిపిన వ్యవహారం తెలుగు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది. ఈ షోలకు వెళ్లకముందే షన్నూకు దీప్తి సునైనతో ప్రేమ వ్యవహారం నడుస్తుంది. వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఇక సిరి కూడా శ్రీహాన్‌ను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. హౌస్‌లో ఉన్న షన్ను – సిరి బయట వేరే వాళ్లతో రిలేషన్లో ఉండి కూడా హౌస్ లోపల వీరు వ్యవహరించిన తీరుతో చాలా మంది షాక్ అయ్యారు. ఇది నెటిజన్లలోనూ తీవ్ర విమర్శలకు కారణం అయ్యింది.
సిరి తల్లి కూడా స్వయంగా ఈ హగ్గింగ్స్ ఏంటంటూ చివరకు అసహనం వ్యక్తం చేసే వరకు వెళ్లింది. అదంతా బిగ్‌బాస్ హౌస్ వరకే అనుకున్నారు. బయటకు వచ్చాక ఎవరి లైఫ్ వారిదే అన్నట్టుగా ఉంటారని అందరూ భావించారు. అయితే బిగ్‌బాస్ సీజన్ 5 పూర్తయిన వెంటనే షన్నూకు బ్రేకప్ చెప్పేస్తున్నట్టు దీప్తి సునైన ప్రకటించి బాంబు పేల్చింది. తాను కూడా దీప్తి నిర్ణయాన్ని గౌరవిస్తానని షన్నూ చెప్పేశాడు. అదే టైంలో అటు సిరి – శ్రీహాన్ కూడా విడిపోతున్నట్టు పుకార్లు షికార్లు చేశాయి.
ఎప్పటికప్పుడు బయట కలుస్తూ ఇన్‌స్టాలో ఫొటోలు షేర్ చేసే వీరిద్దరు బిగ్‌బాస్ సీజన్ 5 తర్వాత ఒక్క ఫొటో కూడా షేర్ చేయకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. త్వరలోనే వీరిద్దరు కూడా తమ ప్రేమకు బ్రేకప్ చెప్పేస్తారనే అందరూ అనుకున్నారు. మీడియాలోనూ అదే ప్రచారం జరిగింది. వీరిద్దరు కలవకపోవడంతో అందరూ అదే నిజమని నమ్మారు. అయితే ఇప్పుడు ఇద్దరూ కలిసే ఉన్నారని తాజా ఫొటో క్లారిటీ ఇచ్చింది. ఇది నిజంగానే పెద్ద ట్విస్ట్..!
యాంకర్ రవి భార్య నిత్యా సక్సేనా ఓ ఫొటో షేర్ చేసింది. ఈ ఫొటోలో సిరి – శ్రీహాన్ కలిసే ఉన్నారు. రవి ఫ్యామిలీతో కలిసి సిరి – శ్రీహాన్ ఓ రెస్టారెంట్‌కు వెళ్లి డిన్నర్ చేసినట్టుగా ఉన్న ఆ ఫొటోలు చూస్తుంటూనే సిరి – శ్రీహాన్ కలిసి ఉన్నారని అర్థమవుతోంది. రవి .. సిరిని తన చెల్లి అంటూ ఫొటోలు షేర్ చేస్తే.. యాంకర్ రవి భార్య నిత్యాను వదిన అన్నట్లుగా సంభోదిస్తూ శ్రీహాన్ ఇన్ స్టా స్టోరీ షేర్ చేశాడు. ఏదేమైనా చాలా రోజుల తర్వాత వీరిద్దరు కలిసే ఉన్నారన్న సంకేతాలు అయితే వచ్చేశాయి.