ఏ రంగంలో అయినా సక్సెస్ ఉన్నప్పుడే విలువ ఉంటుంది. సక్సెస్‌ను అందిపుచ్చుకోవడానికి చాలా కష్టపడాలి.. ఆ తర్వాత దానిని నిలబెట్టుకోవాలి. ఇక టాలీవుడ్‌లో కూడా సక్సెస్ రావడానికి చాలా కష్టపడాలి.. ఆ సక్సెస్ నిలబెట్టుకోవడానికి ఎప్పుడూ కష్టపడాలి. ఒక్కసారి సక్సెస్ చేజారితో దానిని తిరిగి పొందేందుకు అహర్నిశలు కష్టపడాలి. టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కెరీర్ ఇప్పుడు వరుస డిజాస్టర్లతో డేంజర్‌లో పడింది. శతమానం భవతి సూపర్ హిట్ తర్వాత శర్వానంద్ రేంజ్, మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
యూత్‌లో మాత్రమే కాకుండా.. ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో కూడా శర్వానంద్ పాపులర్ అయ్యాడు. అయితే గత కొంత కాలంగా శర్వానంద్ ఏం చేసినా డిజాస్టర్ అవుతోంది. శర్వానంద్ చేస్తోన్న ప్రయోగాలు కూడా వికటిస్తున్నాయి. 2017లో వచ్చిన మహానుభావుడు తర్వాత శర్వానంద్ హిట్టు అన్న మాట వినలేదు. నటుడిగా మంచి పేరున్న శర్వానంద్ కెరీర్ ఒక్కసారిగా డ్రాప్ అవ్వడానికి కారణం ఏంటన్నది చూస్తే చాలానే ఉన్నాయి.
సమంతతో చేసిన జానుకు మంచి పేరు వచ్చినా కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. ఇటీవల వచ్చిన మహాసముద్రం డిజాస్టర్. వాస్తవానికి ఈ సినిమా కథను ముందే కొందరు హీరోలు రిజెక్ట్ చేశారు. శర్వా మాత్రం పట్టుబట్టి చేస్తే ప్లాప్ అయ్యింది. శర్వా వరుసగా ప్లాపులు ఎదుర్కోవడానికి కారణం మనోడు ఎంచుకుంటోన్న కథలే. సరైన కథలు ఎంచుకోవడంలో శర్వానంద్ తడబడుతున్న వాతావరణం ఉంది.
ఇక శర్వా మళ్లీ ప్రస్థానం లాంటి సినిమాలు చేస్తే చూడాలని ఉందని ఆయన ఫ్యాన్స్ చెపుతున్నారు. శర్వా ప్రస్తుతం ఆడవాళ్లు మీకు జోహార్లు – ఒకే ఒక జీవితం సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు విభిన్నమైన కథలతో తెరకెక్కుతున్నాయి. ఈ రెండు ఫిబ్రవరిలోనే రిలీజ్ అవుతున్నాయి. ఆడవాళ్లు మీకు జోహార్లు ఫిబ్రవరి 25న వస్తుంటే… ఒకే ఒక జీవితం కూడా ఈ నెలలోనే వస్తోంది. ఈ రెండు సినిమాలు అయినా శర్వా కెరీర్‌ను నిలబెడతాయేమో ? చూడాలి. ఏదేమైనా శర్వా కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బంది తప్పదు.