Moviesసిరి చాలా మంచిది..కానీ, వాళ్ళ అమ్మ..అరె ఏంట్రా ఇది షన్ను అంత...

సిరి చాలా మంచిది..కానీ, వాళ్ళ అమ్మ..అరె ఏంట్రా ఇది షన్ను అంత మాట అనేశావ్..!!

యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్..సోషల్ మీడియా ద్వార తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్న యంగ్ కుర్రాడు. ఎటువంటి ఎక్స్ ప్రేషన్స్ ని అయిన అలవోకగా పలికించే షణ్ముఖ్..సాఫ్ట్ వేర్ డేవలపర్ అనే సిరీస్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. ఓ స్టారో హీరోకి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈయనకు. కానీ అది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళక ముందు. హౌస్ లోకి వెళ్ళాక షన్నూ జీవితమే మారిపోయింది. హౌస్ లో జరిగిన కొన్ని సఘటనల వల్ల షన్నూ లవర్ దీప్తి సునైనా అతనికి బ్రేకప్ చెప్పేసింది.

నిజానికి వీళ్లు చేసినా కవర్ సాంగ్స్.. వెబ్ సిరీస్ లు అంటే చాలా మందికి ఇష్టం. ఎంత ఫేమస్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అంతేకాదు.. వీరి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పెడుతూనే ఉన్నారు. ఇక అలా అలా వీళ్ల మధ్య ప్రేమ చిగురించి 5 యేర్స్ హ్యాపీగా గడిపారు. కెరీర్ లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందాం అని అనుకున్న ఈ జంట.. ప్రస్తుతం బ్రేకప్ చెప్పేసుకుని వాళ్ల కెరీర్ పై దృష్టి పెట్టారు.

ఇక వాలెంటైన్స్ డే సంధర్భంగా షన్నూ ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యు ఇచ్చారు. ఇక ఈ క్రమంలో షన్నూ మాట్లాడుతూ కొన్ని షాకింగ్ విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ముఖ్యంగా సిరితో తన రిలేషన్ షిప్ గురించి..అలాగే దీప్తి తో ఎందుకు విడిపోయారు అనే విషయాల గురించి చెప్తూ అభిమానులకి క్లారిటీ ఇచ్చేసారు. “నా మైండ్ సెట్ కి నేను బిగ్ బాస్ లాంటి షోకి సెట్ కాను.

నేను అందరితో ఎక్కువుగా కలవలేను. నా ప్రపంచం నాదే. ఇక హౌస్ లో సిరి నేను క్లోజ్ గా ఉందటం జనాలకు నచ్చలేదు. అందుకే ఇంత నెగిటివిటీని ఫేస్ చేస్తున్న. సిరి చాలా మంది అందరు అనుకుంటున్నట్లు నేను దీపు విడిపోవడానికి కారణం సిరి కాదు. తను చాలా మంచిది.

మేము ఇద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అంతే..ఇప్పటికి..ఎప్పటికి కూడా. నిజానికి వాళ్ళ అమ్మగారు హౌస్ లోకి వచ్చి నేను సిరి హగ్ చేసుకున్న దాని గురించి మాట్లాడటం నాకు నచ్చలేదు. చాలా బాధపడ్డాను. ఓత్తిడికి గురైయ్యాను.

ఇక దీపు నా వల్ల చాలా నెగిటివిటీ ఫేస్ చేసింది. వాళ్ల ఫ్యామిలీ కూడా చాలా బాధపడిఉంటారు. నా వల్ల తను బాధపడకూడదు అనే బ్రేకప్ చెప్పేసుకున్నాం. మళ్లీ కలుస్తామా..? లేదా అనేది ఆ దేవుడి చేతిలోనే ఉంది. ప్రజెంట్ ఇద్దరం కెరీర్ పై ఫోకస్ చేస్తున్నాం. విధి మా జీవితాల్లో ఏది రాసుంటే అదే జరుగుతుంది.” అంటూ దీప్తీతో బ్రేకప్ పై షన్ను క్లారిటీ ఇచ్చాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news