ఇప్పుడు తెలుగు సినిమా ప్రేక్షకులు, భారత సినిమా ప్రేక్షకులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినిమా ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తోన్న సినిమా త్రిపుల్ ఆర్. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రు. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25న రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఓ రౌండ్ ఈ సినిమా ప్రమోషన్లు కూడా పూర్తయ్యాయి. చారిత్రక నేపథ్యంతో ముడిపడి ఉన్న కథ కావడంతో పాటు టాలీవుడ్‌లోనే తిరుగులేని క్రేజీ హీరోలుగా ఉన్న యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్లో వస్తోన్న సినిమా కావడంతో త్రిబుల్ ఆర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో త్రిబుల్ ఆర్ రిలీజ్ అవుతోంది. దీంతో ఈ సినిమాను ఎన్ని వేల థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు ? ఎన్ని కోట్ల వసూళ్లు వస్తాయి ? ఓపెనింగ్స్ ఎలా ? ఉంటాయి అన్న చర్చలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమా ప్రస్తావన వచ్చినప్పుడల్లా దర్శకధీరుడు రాజమౌళి చెపుతోన్న ప్రతి విషయం చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటోంది.
సినిమాలో ఇంటర్వెల్ యాక్షన్, క్లైమాక్స్ యాక్షన్ చాలా ఉత్కంఠంగా ఉంటుందని చెప్పిన రాజమౌళి.. సెకండాఫ్‌లో వచ్చే ఓ యాక్షన్ ఎపిసోడ్ గూస్ బంప్స్ తెప్పించడంతో పాటు నరాలు తెగే ఉత్కంఠతో ఉంటుందని చెప్పారు. రాజమౌళి ఈ మాట చెప్పిన వెంటనే ఆ సీన్ ఎలా ? ఉంటుందా ? అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఇక ఇప్పుడు త్రిబుల్ ఆర్‌లో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఎలా ఉండబోతోందో రాజమౌళి చెప్పేశాడు.
ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ సినిమా హైలెట్స్‌లలో ఒకటిగా నిలుస్తుందని చెప్పిన రాజమౌళి.. ఈ సీన్‌ను బల్గేరియా ఫారెస్ట్‌లో షూట్ చేశానని.. ఎన్టీఆర్ కాళ్లకు చెప్పులు, షూ వేసుకోకుండా పరిగెత్తుతాడని చెప్పాడు. ఫారెస్టులో ఎన్టీఆర్ పరిగెడుతుంటే.. పులిలా పరిగెడుతున్నట్టు నాకు అనిపించిందని.. ఆ సీన్ తాను అనుకున్నట్టుగా వచ్చేందుకు ఎన్టీఆర్ ఎంతో కష్టపడ్డాడని.. ఆ సీన్ తెరపై చూస్తున్నప్పుడు ఎన్టీఆర్ అభిమానులు విజిల్స్ వేయకుండా.. క్లాప్స్ కొట్టకుండా ఉండలేరని.. ఎన్టీఆర్ ఎనర్జీ ఆ రేంజ్‌లో ఉందని రాజమౌళి చెప్పాడు.
ఏదేమైనా రాజమౌళి చెపుతుంటేనే ఈ సీన్ ఫ్యీజులు పోయేలా చేస్తోంది. రేపు తెరమీద రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్స్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అవ్వడం ఖాయం.