అనుపమ పరమేశ్వరన్.. ఈ కేరళ కుట్టి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `అ ఆ` మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. మొదటి చిత్రంతోనే యూత్‌ను ఆకట్టుకుంది. ఆ తర్వాత ప్రేమమ్, శతమానం భవతి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది.
ఎక్స్పోజింగ్ చేయకుండానే అనుపమ తనదైన అందం, అభినయంతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. ఇకపోతే వివాదాలకు, వివాస్పద వ్యాఖ్యలకు ఆమడ దూరంలో ఉండే ఈ బ్యూటీ.. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్‌తో మాత్రం గొడవ పడిందట. అసలు వీరిద్దరికీ ఎక్కడ చెడిందంటే.. 2018లో త్రినాధరావు నక్కిన తెరకెక్కించిన కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రం `హలో గురు ప్రేమకోసమే`.
రామ్ పోతినేని, అనుపమ జంటగా నటించిన ఈ మూవీలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రను పోషించారు. 2018 అక్టోబరు 18న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ చిన్న విషయంపై అనుపమతో ప్రకాష్ రాజ్ గొడవ పడ్డారట. ఈ క్రమంలోనే అందరి ముందూ ఆయన ఆమెపై అరిచేశారట.
ప్రకాష్ రాజ్ ప్రవర్తనకు విసుగు చెందిన అనుపమ,, రెండు రోజుల పాటు షూటింగ్‌కు వెళ్లలేదట. సినిమా నుంచి తప్పుకోవాలని కూడా అనుకుందట. కానీ, హీరో రామ్ మరియు డైరెక్టర్ త్రినాధరావు నక్కిన నచ్చజెప్పడంతో షూటింగ్ కంప్లీట్ చేసిందని గతంలో వార్తలు వచ్చాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో వారికే తెలియాలి. కాగా, అనుపమ ప్రస్తుతం నిఖిల్‌తో `18 పేజెస్`, `కార్తికేయ 2` చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు సెట్స్ మీదే ఉన్నాయి.