యూట్యూబ్‌లో పచ్చి బూతులు మాట్లాడుతూ.. తన యాస, భాషలతో ఆకట్టుకుని మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టే సరయు అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు లేదు. ఓ ప్రత్యేకమైన యాస్ తో మాట్లాడడం ఆమె స్పెషాలిటి. యూట్యూబ్ చూసేవారికి సరయు బాగా సుపరిచితురాలే. 7 ఆర్ట్స్ ఛానల్‌లో అప్‌లోడ్ చేసే వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింస్‌కు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. బోల్డ్ వీడియోలు బోల్డ్ మాటాలతో ఎప్పుడు ట్రేండింగ్ లోనే ఉంటుంది.
రీసెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి కూడా వెళ్ళింది. కానీ మొదట వారానికే హౌస్ నుండి బయటకు వచ్చేసి షాక్ ఇచ్చింది. ఇక ఆ తరువాత కొన్ని ఇంటర్వ్యుల్లో కావాలనే బిగ్ బాస్ నన్ను ఎలిమినేట్ చేశారంటూ గొలా చేసింది. ఎవ్వరు పట్టించుకోలేదు. దీంతో సైలెంట్ అయిపోయి మళ్ళీ తన పని తాను చేసుకోవడం మొదలు పెట్టింది. కాగా భారీ దేహపు అందాలతో కవ్విస్తూ.. పచ్చి బూతులు మాట్లాడుతూ యూట్యూబ్‌లో ట్రెండ్ క్రియేట్ చేసిన సరయు.. ఇప్పుడు మరో కొత్త చిక్కుల్లో ఇరుకుంది. ఓ హోటల్ ప్రచారపాటలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని ఆమెపై కేసు పెట్టారు రాజన్న సిరిసిల్ల విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు చేపూరి అశోక్ పోలీసులకు కంప్లైంట్ చేశారు.
సరయు తో పాటు మరికొంతమంది గణపతి బొప్పా మోరియా బ్యాండ్ లను తలకు ధరించి మద్యం సేవించాలని దేవుడు బొమ్మలను దర్శించుకుని మద్యం సేవించి హోటల్స్ కి వెళ్తారు అనే సంకేతాన్ని ఈ పాట ద్వారా ఇస్తున్నారంటూ ఆరోపించారు చేవూరి అశోక్. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాజన్న సిరిసిల్ల పోలీసులు.. ఆపై కేసును బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. = ఈ విధంగా ప్రవర్తించి హిందువుల మనోభావాలను కించపరినందుకు తగిన చర్యలు తీసుకోవాలని చేపూరి అశోక్ పోలీసులను కోరారు. ఇలాంటి చర్యలను హిందూ సమాజం సహించదన్నారు. ఈ కేసుపై సరయు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.