నివేదా పేతురాజ్.. ఈ పేరు చెప్పితే ఒకప్పుడు పెద్దగా గుర్తు పట్టలేకపోయే వారు.. కానీ ‘రెడ్’ సినిమాలో హీరోయిన్ అంటే టక్కున గుర్తు పట్టేస్తున్నారు. ‘మెంటల్ మది’లో అనే సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైనంది నివేథా పేతురాజ్ . ఆ సినిమాలో శ్రీ విష్ణు సరసన భాగానే రోమన్స్ చేసింది. సినిమా బాగానే అలరించిన ఈ అమ్మడుకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. కెరీర్ స్టార్టింగ్ నుండే నుంచే డిఫరెంట్ పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది నివేదా పేతురాజ్.
అందానికి అందం నటపరంగా కూడా ఏం తీసిపాడేయాల్సినంత చీప్ గా ఉండదు. కళ్ళతోనే ఎటువంటి ఎక్స్ ప్రేషన్స్ ని అయినా పల్కించగలదు. కానీ సరైన అవాకాశాలు లేక పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోతుంది. రామ్ ‘రెడ్’ సినిమాతో సందడి చేసిన ఈ బ్యూటీ..ఆ తరువాత అల వైకుంఠపురములో నటించి మరోసారి తళుక్కుమంది. ఇక తరువాత విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ‘పాగల్’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందకు వచ్చి మెప్పించింది నివేదా. ప్రజెంట్ తమిళంతోపాటు తెలుగలోనూ వరుస అవకాశాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోందీ చిన్నది. ప్రస్తుతం తెలుగులో విరాటపర్వం, మరో చిత్రంలోనూ నటిస్తోంది.
కాగా, రీసెంట్ గా అమ్మడు తన ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేస్తూ..లేడీస్ కు కొన్ని సజీషన్స్ ఇచ్చింది. దీంతో అమ్మడు నెట్టింట హాట్ టాపిక్ మారింది. ‘స్కిన్ క్లినిక్ ఎట్–హోమ్’ బ్రాండ్ స్కిన్సీ యాడ్‌లో కనిపించనున్న సంధర్భంగా… ఈ ప్రొడక్ట్ లను క్యాంపెయిన్ ప్రారంభించింది అమ్మడు. ఇక ఇందులో భాగంగానే బ్యూటీ పార్లర్‌కు వెళ్లకుండా మన ఇంటిలోనే అవాంఛిత రోమాలను తొలగించుకునే ఈజీ ప్రాసెస్ ను అమ్మాయిలకు అర్ధమైయేలా వివరించింది. ‘ పార్లర్‌లో కూర్చుని బాడీపై వెంట్రుకలు తొలగించుకునే పాత వాక్స్ పద్ధతుల్లో విసుగెత్తిపోయారా? అంత బాధ భరించలేకపోతున్నారా.
అయితే ఇక అలాంటి వాటికి నో చెప్పేసి.. డెర్మటాలజిస్ట్ ఆమోదించిన ‘Ice Cool4 wavelength technology’ ద్వారా ఇంట్లోనే కేవలం 6-10 సెకన్లలో 90% వరకు హెయిర్ స్మూత్ చేసుకోండి అంటూ సలహా ఇచ్చింది. ఇలా చేస్తే ఇక పై పార్లర్ లో బచ్చే నొప్పి భరించాల్సిన పని లేదు “అంటూ ఓ నోట్ షేర్ చేసింది. దీంతో అమ్మడు పోస్ట్ తెగ టృఎండింగ్ గా మారింది.
View this post on Instagram