Moviesపెళ్లి ఎప్పుడో అయిపోయింది..ఇక మిగిలింది అదే..బిగ్ షాకిచ్చిన ఆలియా..!!

పెళ్లి ఎప్పుడో అయిపోయింది..ఇక మిగిలింది అదే..బిగ్ షాకిచ్చిన ఆలియా..!!

బాలీవుడ్ క్రేజీ బ్యూటీ ఆలియా భట్ ప్రస్తుతం వరుసగా క్రేజీ ఆప‌ర్ల‌తో దూసుకుపోతోంది. అటు బాలీవుడ్ లోను ఇటు టాలీవుడ్ లోను వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ..బిజీ బిజీ గా గడిపేస్తుంది. ఆమె తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లోనూ బడా బడా క్రేజీ ఆఫర్లతో బిజీ బిజీగా ఉంది. ఇక ఆత్ఆర్ఆర్ సినిమాలో కేవలం పదిహేను నిమిషాల పాత్ర కోసం ఆమె ఐదు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. దీని పై అమ్మడు ఏం మాట్లాడకపోవడంతో అంతే ఇది నిజమే అనుకుంటున్నారు అభిమానులు.

ఇక అమ్మడు రేంజ్ కు ఆ మాత్రం ఇచ్చిన పర్లేదు లే అంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే, సినిమాల పరంగా బిజీ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ..బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌బీర్ క‌పూర్ తో ప్రమాయణం నడుపుతున్న సంగతి తెలిసిందే. పెళ్లి మాత్రమే కాలేదు ..ఈ జంట అన్ని పనులు కానిచ్చేస్తుంది. పబ్లిక్ గానే భార్య భర్తలు లా తిరిగేస్తున్నారు. అంతేనా కొన్ని సార్లు ఒక్కే ఇంట్లో కూడా ఉండిపోతున్నారట.

ఈ విషయం మీడియా కి తెలియకుండా మ్యానేజ్ చేస్తున్నా అసలు విషయం లీక్ అయిపోయింది. ఇక ఆలియా భ‌ట్ త్వ‌ర‌లోనే వివాహ బంధంతో ఒక్క‌టి అవుతార‌న్న వార్త‌లు బాలీవుడ్‌లో ఎప్ప‌టి నుంచో వ‌స్తున్నా..వాళ్ళ పెళ్లి వార్త వినపడుతుందే కానీ..మ్యాటర్ ముందుకు వెళ్లడం లేదు. దీంతో ర‌ణ్‌బీర్-ఆలియా నెట్టింట హాట్ టాపిక్ గా మారిపోయారు, తాజాగా మ‌రోసారి ర‌ణ్‌బీర్ ఆలియా పెళ్ళి వార్త‌లు మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇందుకు కారణం ఆలియా. యస్..ఆమె మాట్లాడిన మాటలే ఇప్పుడు సంచలనంగా మారాయి.

 

తాజాగా గంగూబాయ్‌ కతియావాడి ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఆలియా భట్‌ తొలిసారిగా తన పెళ్లి విషయంపై స్పందించింది. ఓ ఇంటర్వ్యుల్లో ఆలియా మాట్లాడుతూ..రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. గతంలో రణ్‌బీర్‌ లాక్‌డౌన్‌ లేకపోతే ఈపాటికి మా పెళ్లి అయిపోయి ఉండేదని అన్నారు కదా నిజమేనా? ఆలియా అని ప్రశ్నించగా..

ఆమె మాట్లాడుతూ ” నిజానికి మా పెళ్లి ఎప్పుడీ అయిపోయింది. చాలా కాలం క్రితమే నా మైండ్‌లో అతన్ని పెళ్లి చేసేసుకున్నాను అంటూ నవ్వుతూ.. రణ్‌బీర్‌ చెప్పింది కరెక్టే.. లాక్‌డౌన్‌ వల్ల పెళ్లి వాయిదా పడింది.. మంచి ముహూర్తం దొరికిన్నప్పుడు తప్పకుండా మా పెళ్లి జరుగుతుంది’ అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇక దీని పై అప్పుడే ట్రోలింగ్ స్టార్ట్ చేసారు ట్రోలర్స్. మీకు పెళ్లే కాదు అన్నీ అయిపోయాయి..కేవలం తాళ్లి కట్టడం మాత్రమే మిగిలింది అంటూ కౌంట్ర్స్ వేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news