Gossipsఐశ్వర్యకు మైండ్ బ్లాకింగ్ షాక్..ధనుష్ సంచలన నిర్ణయం..?

ఐశ్వర్యకు మైండ్ బ్లాకింగ్ షాక్..ధనుష్ సంచలన నిర్ణయం..?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్..గత కొన్ని రోజుల నుండి నెట్తింట బాగా ట్రోలింగ్ కు గురి అవుతున్నాడు. దానికి కారణాలు లేకపోనూలేదు. శుభ్రంగా భార్యతో సంసారం చేసుకోకుండా..చక్కటి భార్యకు విడాకులు ఇవ్వదం ఒక తప్పు అయితే. ఇలాంటి టైంలో తనకు వేరే అమ్మాయితో ఎఫైర్ ఉందని వార్తలు వస్తున్న తరుణంలో ఓ అమ్మాయిని పబ్లిక్ గా రెస్టారెంట్ కు తీసుకెళ్లి పక్కన కూర్చో బెట్టుకుని లంచ్ చేయడం మరో తప్పు అంటున్నారు నెటిజన్స్. దీంతో ఈయన వ్యవహార శైలీ నచ్చక చాలా మంది ఈయన అభిమానులు సైతం తిట్టిపోస్తున్నారు.

నిజానికి ధనుష్ అంటే తమిళ ప్రజలకు చాలా ఇష్టం. ఎందుకంటే..హీరోగా ఎదగాలి అంటే కావాల్సింది కలర్.. పర్సనాలిటీ కాదు. హీరో కావాలంటే కష్టపడ్డాలి.. క్రమశిక్షణ ఉండాలి అని నిరూపించాడు హీరో ధనుష్. ఈయన ఏం చేసిన ఫస్ట్ సినిమాకే స్టార్ అయిపోలేదు..ఎన్నో ఫాల్ప్ సినిమాలు తన ఖాతాలో వేసుకుని..అలా అలా కష్టపడుతూ..ఫైనల్ గా కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరుగా నిలిచారు. వాస్తవానికి ధనుష్‌కి నటనపై ఇష్టమే లేదట. తన తండ్రి, దర్శకుడు కస్తూరి రాజా కోరిక మేరకు బలవంతంగా సినిమాల్లో నటించాడు. అలా అయిష్టంగానే సినిమాల్లోకి వచ్చి ఇప్పుడు కోలివుడ్‌లో స్టార్‌ హీరోగా ఎదిగాడు. కొలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు అయినప్పటికీ.. సొంతంగానే తన నటన టాలెంట్ ఉపయోగించి ప్రతి సినిమాకు మంచి క్రేజ్ ను పెంచుకుంటూపోతున్నాడు.

కెరీర్ పరంగా దూసుకుపోతున్న ఈయన సడెన్ గా తన వైఫ్ కి డైవర్స్ ఇస్తున్నా అనే సైరికి అందరు షాక్ అయ్యారు. రీసెంట్ గా ఓ అమ్మాయితో ధనుష్ తిరుగుతున్న ఫోటోలో నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఇప్పుడు మరో షాకింగ్ విషయం లీకైంది. ధనుష్ కొత్త ఇంటిని కట్టుకుంటున్నారట. భార్యాభర్తలు ఇద్దరూ తమ ఇద్దరు పిల్లలతో కలిసి జీవితాన్ని గడిపిన ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేక.. ధనుష్ తన కోసం సపరేటుగా ఓ పెద్ద బంగ్లా ని కట్టించుకోబోతున్నారట.

ప్రస్తుతానికి ధనుష్ హోటల్‌లోనే బస చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన కట్టిస్తున్న ఇల్లు పూర్తి అయిన వెంటనే అక్కడికి షిఫ్ట్ అవుతారట. ఈ ఇంటికోసం ధనుష్ సుమారు 300 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే నిజమైతే 300 కోట్ల రూపాయల ఇల్లు సొంతం చేసుకున్న ఏకైక హీరోగా ధనుష్ రికార్డు సృష్టించడం ఖాయం. అయితే కొందరు నెటిజన్స్ మాత్రం ఇల్లు కట్టుకుంటే సరిపోదా..అందులో దీపం పెట్టడానికి ఇళ్లాలు ఉండాలిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news