టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు కెరీర్‌లో వరుస పెట్టి సూపర్ హిట్లతో దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే మహేష్‌బాబు రాజకుమారుడు సినిమా హిట్ అయ్యాక.. మళ్లీ తన రేంజ్‌కు తగ్గ హిట్ కోసం ఒక్కడు వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. యువరాజు బిలో యావరేజ్, వంశీ ప్లాప్.. మురారి ఓకే.. అయితే మరీ ఇరగదీయలేదు… టక్కరిదొంగ సినిమా బాగున్నా ఆడలేదు.. బాబి ప్లాప్.. ఇలా కొనసాగుతోన్న టైంలో ఒక్కడు మహేష్ కెరీర్‌ను నిలబెట్టేసింది.
ఆ టైంలో మహేష్‌బాబు అనుకోకుండా ఓ బ్లాక్‌బస్టర్ సినిమా మిస్ అయ్యారు. పైగా అది అందమైన ప్రేమకథ.. మహేష్ ఇమేజ్‌కు అప్పట్లో బాగా సూట్ అయ్యేది. ఆ సినిమా ఏదో కాదు నువ్వు లేక నేను లేను. 2002 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా టక్కరిదొంగ – సీమసింహం సినిమాలను మించి హిట్ అయ్యింది. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో పలు సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేసిన కాశీ విశ్వనాథ్ ఓ మంచి స్టోరీ రెడీ చేసుకున్నాడు. ఆయన ఈ అందమైన ప్రేమకథను ముందుగా సురేష్‌బాబుకు చెప్పారు.
కథ నచ్చిందన్న ఆయన మహేష్‌బాబుతో సినిమా తీయాలని చెప్పారట. అయితే అప్పటికే మహేష్‌బాబుకు చాలా కమిట్‌మెంట్లు ఉన్నాయి. మహేష్‌తో చేయాలంటే కనీసం మూడు, నాలుగేళ్లు ఆగాలని.. అప్పటి వరకు వెయిట్ చేయవద్దని తరుణ్‌తో చేద్దామని సురేష్‌కు చెప్పారట. వెంటనే కాశీ విశ్వనాథ్ తరుణ్ తల్లి రోజారమణి దగ్గరకు వెళ్లి ఈ కథ చెప్పడంతో వెంటనే ఓకే చేశారట.
అప్పటికే తరుణ్ నువ్వేకావాలి – ప్రియమైన నీకు లాంటి సూపర్ హిట్లతో జోరుమీదున్నాడు. ఇక ఆర్తీ అగర్వాల్ అప్పటికే వెంకటేష్‌తో నువ్వునాకు నచ్చావ్ లాంటి సూపర్ హిట్ సినిమా చేసింది. యువతలో ఆర్తీకి మాంచి క్రేజ్ వచ్చేసింది. దీంతో ఆమెను హీరోయిన్‌గా తీసుకున్నారు. అలా సురేష్ ప్రొడక్షన్‌లోనే ఆ సినిమా స్టార్ట్ అయ్యింది. ఆర్పీ. పట్నాయక్ ఇచ్చిన మ్యూజిక్ అదిరిపోయింది. పైగా మహేష్‌బాబు, బాలయ్య సినిమాలకు పోటీగా 2002 సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఇదే కథ మహేష్‌కు పడి ఉంటే మహేష్ కెరీర్‌లో ఓ మాంచి సినిమా అయ్యి ఉండేది.