కొరటాల శివ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరిగా దూసుకుపోతున్నారు. కొరటాల శివకు తిరుగులేని క్రేజ్ ఉంది. చేసినవి ఐదు సినిమాలే.. అన్నీ కూడా సూపరే. మిర్చి – శ్రీమంతుడు – జనతా గ్యారేజ్ – భరత్ అనే నేను తాజాగా మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య. కొరటాల శివ తొలి సినిమా మిర్చి నుంచి అన్ని సినిమాలకు దేవీ శ్రీప్రసాద్ మ్యాజిక్ డైరెక్టర్‌గా ఉన్నారు. వీరి కాంబినేషన్లో వచ్చిన అన్ని సినిమాలు మ్యూజికల్‌గా హిట్ అయ్యాయి.
కొరటాల కూడా తన సినిమా అంటే దేవిశ్రీనే మ్యూజిక్ డైరెక్టర్ అని ఫిక్స్ అయిపోతారు. అయితే ఆచార్య సినిమాకు కూడా దేవిశ్రీనే అనుకుంటే చిరంజీవి పట్టుబట్టి మరీ మణిశర్మను తీసుకోమని రిఫర్ చేశారు. కొరటాలకు ఇష్టం ఉన్నా లేకపోయినా మణిశర్మతో కమిట్ అవ్వక తప్పలేదు. చిరుకు మణిశర్మ సెంటిమెంట్. గతంలో వీరి కాంబోలో వచ్చిన సినిమాలు అన్ని హిట్ అయ్యాయి. అందుకే మణిని చిరుయే స్వయంగా రికమెండ్ చేశారు.
ఆచార్య సాంగ్స్ అన్ని హిట్ అయ్యాయి. ఇక ఆర్ ఆర్ కూడా అదిరిపోయేలా వచ్చిందని అంటున్నారు. ఆచార్యను కంప్లీట్ చేసిన కొరటాల ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాను జూనియర్ ఎన్టీఆర్‌తో చేస్తోన్న సంగతి తెలిసిందే. యువసుధా ఆర్ట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా దేవిశ్రీని పక్కన పెట్టేసినట్టే..!
ఎన్టీఆర్ సిఫార్సుతో కొరటాల ఈ సినిమాకు కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్‌ను తీసుకున్నారు. గతంలో ఎన్టీఆర్ సినిమాకు అనిరుధ్ పనిచేయాలి. అరవింద సమేత వీరరాఘవ సినిమా కోసం అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. ఆ ఛాన్స్ మిస్ అయ్యింది. ఇక ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది. అలా అప్పుడు చిరు కోరిక మేరకు దేవిశ్రీని పక్కన పెట్టిన కొరటాల ఇప్పుడు కూడా అనిరుధ్‌తో కలిసి పనిచేయాల్సి వచ్చింది.