మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటించిన ఖిలాడి, సిద్ధు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు సినిమాలు ఈ వారం బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డాయి. వాస్తవంగా చూస్తే ఖిలాడీ సినిమాపై ఉన్న అంచనాలతో పోలిస్తే డిజే టిల్లు సినిమా పోటీలో నిలబడుతుందా ? అన్న సందేహాలు ఇండస్ట్రీ వర్గాలు, ట్రేడ్ వర్గాల్లో ఉన్నాయి. కట్ చేస్తే ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికే డిజే టిల్లు సినిమా జోరు ముందు ఖిలాడి సినిమా పూర్తిగా తేలిపోయింది. అసలు రెండు సినిమాలకు జరిగిన బిజినెస్… వసూళ్లను కంపేరిజన్ చేస్తుంటే టిల్లు సినిమా ముందు ఖిలాడి ఎందుకు పనికి రాని పరిస్థితి ఉంది.
రవితేజ గతేడాది క్రాక్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి ఉండడంతో పాటు ఖిలాడికి రిలీజ్‌కు ముందే ప్రి రిలీజ్ బిజినెస్ రవితేజ కెరీర్‌లోనే హయ్యస్ట్ రేంజ్‌లో జరగడంతో పాటు దర్శకుడు రమేష్‌వర్మకు నిర్మాతలు ఖరీదైన కాస్ట్‌లీ కారు గిఫ్ట్‌గా ఇవ్వడంతో సినిమా సూపర్ హిట్ అవుతుందనే అనుకున్నారు. అయితే ఖిలాడి కంటెంట్ వీక్‌గా ఉండడంతో అంచనాలు రివర్స్ అయ్యాయి. డీజే టిల్లు సినిమాలో కథ లేకపోయినా.. కామెడీ, యూత్‌కు పిచ్చగా నచ్చే అంశాలు ఉండడంతో టిల్లు సినిమా తొలి రోజే చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అయ్యి అందరికి షాక్ ఇచ్చింది.
మొదటి రోజు మాత్రమే ఖిలాడికి ఎక్కువ వసూళ్లు వచ్చినా.. టిల్లు రిలీజ్ అయిన రెండో రోజు ఖిలాడి వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. ఖాలాడి మొదటి నాలుగు రోజుల్లో రు. 10 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇంకా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో రు. 15 కోట్లు కొల్లగొట్టాలి. ఇక డిజె టిల్లు మొదటి నాలుగు రోజుల్లో రు 10.5 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమాకు రు. 2 కోట్ల పై చిలుకు లాభాలు వచ్చేశాయి. ఓవరాల్‌గా చూస్తే టిల్లు లాంగ్ రన్‌లో రు. 50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఖిలాడీ బయ్యర్లకు భారీ నష్టాలు తప్పేలా లేవు. ఏదేమైనా టిల్లు వసూళ్లతో కంపేరిజన్ చేస్తే.. ఖిలాడికి ఇది అవమానమే అవుతుంది.