మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటించిన ఖిలాడీ సినిమాకు మొదటి రోజు భారీగా వసూళ్లు వచ్చినట్టు నిర్మాతలు ప్రకటించారు. రవితేజ గతేడాది క్రాక్ సినిమాతో హిట్ కొట్టి ఉండడంతో పాటు ఇటు స్టైలీష్‌గా పోస్టర్లు ఉండడం, హీరోయిన్లు మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి ఇద్దరూ కూడా ముందు నుంచే భారీ అందచందాలు ఆరబోసేయడం, రాక్షసుడు సినిమా హిట్ తర్వాత రమేష్‌వర్మ డైరెక్ట్ చేసిన సినిమా కావడం.. ఇటు ప్రి రిలీజ్ బిజినెస్‌లో భారీ అడ్వాన్సులు రావడంతో ఖిలాడిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అందుకు తగ్గట్టే తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రు 4.30 కోట్ల వసూళ్లు వచ్చాయి. ప్రి రిలీజ్ బజ్ భారీగా ఉండడంతో హయ్యర్లు భారీగా వచ్చాయి. దీనికి తోడు తెలంగాణలో భారీగా అడ్వాన్స్ బుకింగ్‌లు జరిగాయి. దీంతో ఈ సినిమా తొలి రోజు మంచి వసూళ్లే రాబట్టింది. అయితే ఖిలాడి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రు. 25 కోట్ల షేర్ రావాలి. కంటెంట్ వీక్ అన్న టాక్ వచ్చింది. ఈ వీక్ టాక్‌తో అంత షేర్ ఎలా రాబడుతుంది ? అన్నది డౌటే ?
ఇక తొలి రోజు పర్వాలేదనిపించిన ఖిలాడి రెండో రోజు బాగా డ్రాప్ అయ్యింది. రెండో రోజు సిద్ధు జొన్నలగడ్డ నటించిన డీజె టిల్లు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు నైజాంలో ఈ సినిమా ఎఫెక్ట్ ఖిలాడిపై గట్టిగా పడినట్టే ఉంది. నైజాంలో మార్నింగ్, మ్యాట్నీ షోలకు ఖిలాడి చాలా చోట్ల ఫుల్ కాలేదు.
టిల్లు సినిమా యూత్‌కు భారీగా కనెక్ట్ కావడంతో ఖిలాడికి బాక్సాఫీస్ దగ్గర భారీ దెబ్బ పడినట్టే అంటున్నారు. ఇక ఏరియాల వారీగా చూసుకుంటే ఆంధ్రాలో ఈ సినిమాకు కోటి 88 లక్షలు – సీడెడ్ లో 56 లక్షలు – నైజాంలో కోటి 86 లక్షల రూపాయల షేర్ వచ్చినంది.