సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక ప్రతి నిర్ణయం ఆచి తూచి తీసుకోవాలి. అప్పుడే కెరీర్ పై పైకి ఎదుగుతుంది. ఒక్క హిట్ సినిమా పడడంతో..నువ్వు తోపు..నిన్ను ఆపేవారు లేరు అంటూ ఎవరైన పొగిడేస్తే పొంగిపోయి..మన దగ్గరకు వచ్చిన ప్రతి డైరెక్టర్ చెప్పిన కధను ఊ కొట్టి..సైన్ చేస్తే..ఆ తరువాత కధ వేరేలా ఉంటాది. ఇక ఇలాంటి పనే చేసి ప్రస్తుతం దాని ఫలితాని అనుభవిస్తుంది కీర్తి సురేష్.
సినీ ఇండస్ట్రీలోకి నేను శైలజ అనే మూవీ ద్వారా తెలుగు చిత్రపరిశ్రమలో కాళ్లు మోపిన ఈ అమ్మడు.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసిన హిట్ టాక్ ను తెచ్చుకోలేకపోయాయి. అయితే ఆ టైంలో అమ్మడుని అదృష్టం వరించి..నాగ్ అశ్విన్ రూపంలో తలుపుతట్టింది. మహనటి సినిమాలో సావిత్రి గారి పాత్రకు select అయ్యింది.
సినిమా తెరకెక్కించేటప్పుడు మహానటి మూవి హిట్ అవుతుంది అనుకున్నారు కానీ ..ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఎక్స్ పెక్ట్ చేయలేదట మేకర్స్. ముఖ్యంగా ఈసినిమా తరువాత కీర్తి రేంజ్ మారిపోయింది. సావిత్రి పాత్రలో ఆమె పర్ ఫామెన్స్ చూసి ఫిదా అయినా స్టార్ డైరెక్టర్స్ ఆమెకు బంపర్ ఆఫర్లు ఇస్తూ మంచి మంచి కధలను వినిపించారు.
కానీ కీర్తి తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలియదు కానీ..మంచి స్టోరీ లైన్ ఉన్న సినిమాలను మిస్ చేసుకుంది. ఇక అలా కీర్తి మిస్ చేసుకున్న సినిమాలు మిగత హీరోయిన్స్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. కీర్తి ఒప్పుకుని చేసిన సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దానికి బెస్ట్ ఉదాహరణ.. శ్యామ్ సింగరాయ్. మొదటగా ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర కోసం కీర్తి ని సంప్రదించారట.
కానీ ఆమె రజనీకాంత్ తో పెద్దన్న సినిమా కమిట్ అయ్యి ఉండటంతో..నాని సినిమాను రిజెక్ట్ చేసారట. రజనికాంత్ లాంటి లెజండ్ హీరోతో సినిమా చేస్తే తన దశ తిరిగిపోది అనుకునింది పాపం..కానీ సీన్ కట్ చేస్తే..బాక్స్ ఆఫిస్ వద్ద శ్యామ్ సింగరాయ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది..పెద్దన్న అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఇక ఆ తరువాత వచ్చిన సఖీ మూవీ కూడా పరమ చెత్త సినిమాగా టాక్ తెచ్చుకుంది. దీంతో ఒక్కసారిగా కీర్తి కెరీర్ మారిపోయింది. మరి చూడాలి అమ్మడు నెక్స్ట్ సినిమాలు అయిన గుడ్ లక్ తెస్తాయో లేదో..?