సీనియర్ నటుడు కృష్ణ వారసుడిగా ఇండ్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు సూపర్‌స్టార్ మహేష్‌బాబు. కెరీర్‌లో ఎప్పుడూ లేనంత ఫుల్ స్వింగ్‌లో ఉన్న మహేష్ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. సరిలేరు నీకెవ్వరు హిట్ జోష్‌లో ఉన్న మహేష్ ప్రస్తుతం పరశురాం పెట్ల దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోన్న ఈ సినిమా మే 12న రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కూడా పట్టాలు ఎక్కేసింది.
మహేష్‌బాబు సినిమా లైఫ్‌లో ఎంత బిజీగా ఉన్నా కూడా పర్సనల్ లైఫ్‌కు ఎంతో ప్రాధాన్యం ఇస్తాడన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహేష్ విదేశాలకు షూటింగ్‌లకు వెళ్లినప్పుడు భార్య నమ్రతతో పాటు పిల్లలను కూడా తీసుకుని వెళుతూ ఉంటారు. ఫ్యామిలీ లైఫ్‌ను మిస్ అయ్యేందుకు మహేష్ ఏ మాత్రం ఇష్టపడడు. మహేష్ నిత్యం సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటే నమ్రత పిల్లల బాధ్యతలను చూసుకుంటూ ఉంటుంది.
తాజాగా బాలకృష్ణ అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకేలో పాల్గొన్న మహేష్‌బాబు తన పర్సనల్ విషయాలతో పాటు నమ్రత గురించి కూడా చాలా విషయాలు చెప్పాడు. తన ఫ్యామిలీలో వెకేషన్‌కు వెళ్లాలని ప్లాన్ చేసిన తర్వాత క్యాన్సిల్ అయితే గౌతమ్ కామ్‌గా ఉంటాడని.. సితార మాత్రం ఊరుకోదని.. చెప్పిన మాట వినకుండా ఏం చేయాలని అనిపిస్తే అదే చేసేస్తుందని చెప్పాడు.
పిల్లల పూర్తి బాధ్యతలు అన్నీ నమ్రతే చూసుకుంటుందని.. వాళ్ల చదువులు, మార్కులు కూడా తాను పట్టించుకోనని మహేష్ తెలిపాడు. షూటింగ్ పూర్తి చేసుకుని.. ఇంటికి వచ్చామా ? పిల్లలతో సరదాగా గడిపామా ? పడుకున్నామా ? అన్నదే తన పని అని ఈ షోలో మహేష్ తెలిపాడు.